https://oktelugu.com/

Rinku Singh: గ్యాస్ సిలిండర్లు అమ్మిన ప్రాంతంలోనే 3.5 కోట్లతో ఇల్లు.. రింకూసింగ్ ఎమోషనల్ సక్సెస్ స్టోరీ

అతడిది పేద కుటుంబం. కానీ క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం. ఖరీదైన క్లబ్ లలో చేరే అవకాశం లేదు. ట్రైనింగ్ తీసుకునే వెసులుబాటు లేదు. కష్టేఫలి అన్నట్టుగా.. చివరికి విజయం సాధించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 7, 2024 2:32 pm
    Rinku Singh(1)

    Rinku Singh(1)

    Follow us on

    Rinku Singh: బతుకు తెరువు కోసం తన తండ్రి ఎక్కడైతే గ్యాస్ సిలిండర్లు అమ్మాడో.. అక్కడే 3.5 కోట్లు పెట్టి ఇంటిని కొనుగోలు చేశాడు. అతడే టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్. ఐపీఎల్ లో కోల్ కతా జట్టు ఇతడిని 13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. 2025 సీజన్ కు రిటైన్ చేసుకుంది. 2024 సీజన్లో కోల్ కతా ఐపీఎల్ విజేతగా ఆవిర్భవించడంలో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. కోల్ కతా జట్టు 13 కోట్లకు కొనుగోలు చేసిన అనంతరం ఆ డబ్బుతో రింకూ సింగ్ 3.5 కోట్లతో అత్యంత విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. రింకూ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. కోల్ కతా జట్టు 13 కోట్ల ఫీజు చెల్లించడంతో.. రింకూ సింగ్ అలీ గడ్ ప్రాంతంలోని ఓజోన్ సిటీలో 500 చదరపు గజాల విస్తీర్ణంలో భారీ భవంతిని కొనుగోలు చేశాడు. ఇటీవల గృహ ప్రవేశం కూడా చేశాడు. రింకూ సింగ్ తండ్రి కుటుంబ పోషణ కోసం ఆ ప్రాంతంలోనే గతంలో గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి తిరిగి వేసేవాడు. అదే ప్రాంతంలో రింకూ సింగ్ ఇంటిని కొనుగోలు చేయడం విశేషం. ఇది సోషల్ మీడియాలో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది. “రింకూ గొప్ప పని చేశాడు. తన తండ్రికి పుత్ర వాత్సల్యాన్ని కలిగించాడు. అతడు చిరస్థాయిగా నిలిచిపోతాడు. తన ఆటతీరుతో మరింత ఆకట్టుకుంటే అతడు ఎక్కడికో వెళ్లిపోతాడని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

    చలన బ్యాటింగ్

    రింకూ సంచలన బ్యాటింగ్ తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోయాడు. 2023 సీజన్లో గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో యష్ దయాల్ బౌలింగ్లో అతడు ఏకంగా ఐదు బంతులకు ఐదు సిక్సర్లు కొట్టాడు. ఓడిపోయే మ్యాచ్లో కోల్ కతా ను గెలిపించాడు. ఆ ఇన్నింగ్స్ రింకూ సింగ్ కు సరికొత్త గుర్తింపును తీసుకొచ్చింది.. తనకు పేరు వచ్చినప్పటికీ రింకూ కోల్ కతా జట్టులోనే ఉన్నాడు. అయినప్పటికీ అతడికి 55 లక్షల ఫీజు మాత్రమే దక్కింది. తాజా జాబితాలో అతనికి ఏకంగా 13 కోట్లు లభించాయి. కోల్ కతా జట్టు తీసుకున్న సంచలన నిర్ణయంతో రింకూ సింగ్ మిలియనీర్ అయిపోయాడు. గత సీజన్లో స్టార్క్ 24.75 కోట్లు, అయ్యర్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన కోల్ కతా.. ఈసారి వారిని వదిలేసుకుంది. విధ్వంసకరమైన బౌలర్ సునీల్ నరైన్, మిస్టరీ స్పిన్ బౌలర్ వరుణ్ చక్రవర్తి, యువ బౌలర్ హర్షిత్ రాణా, ఆల్ రౌండర్ రమణ్ దీప్ సింగ్ ను జట్టుతోనే ఉంచుకుంది. కోసం ఏకంగా 57 కోట్లు ఖర్చు చేసింది.. రింకు కు 13, వరుణ్, సునీల్, రస్సెల్ కు 12 కోట్ల చొప్పున చెల్లించింది. రమణ్ దీప్ సింగ్ కు నాలుగు కోట్లు ఇచ్చింది. కోల్ కతా జట్టు వద్ద ఇంకా 63 కోట్ల వరకు పర్సనల్ ఉంది. కోల్ కతా జట్టు వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆర్టీఎం కార్డు లేదు. ఎందుకంటే ఆ జట్టు ఆరుగురికి ఆరుగురుని రిటైన్ చేసుకుంది.