Rinku Singh Love Story: అనుకోకుండా అమ్మాయిని చూడడం.. ఆమెను తన కలల రాణిగా ఊహించుకోవడం.. ఆమె మనసులో చోటు సంపాదించడం.. ఆమె తన జీవిత భాగస్వామిగా చేసుకోవడం.. ఇంతటి వ్యవహారంలో అనేక గొడవలు.. ఇంకా అనేక పోరాటాలు.. చదువుతుంటే సినిమా స్టోరీ గుర్తుకు వస్తుంది కదా.. ఇలాంటి స్టోరీ క్రికెటర్ రింకూ లైఫ్ లో కూడా ఉంది. కాకపోతే అతడు తన ప్రేమను గెలిపించుకోవడానికి యుద్ధాలు చేయలేదు. పోరాటాలు అంతకంటే చేయలేదు. ఇంతకీ అతడి లవ్ స్టోరీ ఎలా మొదలైంది.. ఎక్కడ శుభం కార్డు పడింది..
Also Read: ఆ వైసీపీ సీనియర్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రికెటర్ రింకూ సింగ్.. 2023 ఐపిఎల్ లో అదరగొట్టాడు. 2024 లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే అతడు పేద కుటుంబంలో పుట్టాడు. పదవ తరగతి వరకే చదువుకున్నాడు. అయినప్పటికీ క్రికెట్ మీద తనకున్న ఇష్టంతో దినదిన ప్రవర్తమానంగా ఎదిగాడు. తనను తాను అద్భుతమైన క్రికెటర్ గా మలచుకున్నాడు. వర్ధమాన క్రికెటర్ అయిన తర్వాత అతడు అనేక కష్టాలు పడి తన ప్రేమను గెలిపించుకున్నాడు. ఇదే విషయాన్ని అతడు ప్రైవేట్ కార్యక్రమంలో వెల్లడించాడు. ఇటీవల రింకు ప్రియా సరోజ్ అనే పార్లమెంట్ సభ్యురాలితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.. ఆమె సమాజ్వాది పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా గడచిన ఎన్నికల్లో విజయం సాధించింది. ఇటీవల సరోజ్ తో రింకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆమెతో ఏర్పడిన ప్రేమ.. అది పెళ్లిదాకా వెళ్ళిన తీరును అతడు రొమాంటిక్ సినిమా స్టోరీ లాగా చెప్పాడు..
” సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ కు ప్రియ హాజరైంది. ఆమె ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది. అప్పటినుంచి ఆమె నా జీవిత భాగస్వామి అని నిర్ణయించుకున్నాను.. నా ప్రేమ విషయం ఆమెకు చెప్పాలంటే భయం వేసింది. కొద్ది రోజులకు ఆమె ఇంస్టాగ్రామ్ లో నా ఫోటోలతో లైక్ చేసింది. ఆ తర్వాత ఆమెకు నేను వ్యక్తిగత సందేశాలు పంపించాను. అప్పటినుంచి ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇలా ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. ఆ తర్వాత కబుర్లతో కాలక్షేపం చేసాం. చివరికి మనసులో ఉన్న మాటలు చెప్పుకున్నాం. ఇద్దరి అభిప్రాయాలు కుదిరిన తర్వాత మా ప్రేమ వ్యవహారాన్ని మరో స్థాయి దాకా తీసుకెళ్లాలని భావించాం. అలా ఇద్దరం ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నామని” రింకూ వెల్లడించాడు.. ఇటీవలే రింకూ, ప్రియ ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ.. వారి వివాహం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని రింకూ తన లవ్ స్టోరీ చెప్పడం ద్వారా బయటకు వెల్లడించాడు.