Ponting Vs Gambhir: ఇటీవలి ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. అతడు సరైన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోవడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది. పైగా వరుస ఓటములు ఎదుర్కొంది. దీంతో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలి పట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే వాటిని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఖండించాడు. “విరాట్ కోహ్లీ ఎలాగైనా ఆడతాడు. ఎలాంటి మైదానం పైనైనా చెల రేగుతాడు. అతని గురించి జరుగుతున్న చర్చ సరికాదు. అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని” గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై రికీ పాంటింగ్ స్పందించాల్సి వచ్చింది. రికీ పాంటింగ్ ఇటీవల విరాట్ కోహ్లీ పాటతీరుపై విమర్శలు చేశాడు. గత మూడు సంవత్సరాల లో విరాట్ కోహ్లీ అంతగా ఆడటంలేదని.. అతడు చేసిన సంచలన సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని వివరించాడు. అయితే ఈ వ్యాఖ్యలను ఇటీవల ఓ విలేకరుల సమావేశంలో గౌతమ్ గంభీర్ ముందు విలేకరులు ప్రస్తావించారు.. దీనిపై గంభీర్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.” కోహ్లీ ఫామ్ గురించి పాంటింగ్ కు ఎందుకు? కోహ్లీ ఎలా ఆడతాడనేది మాకు తెలుసు. రోహిత్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో కూడా మాకు తెలుసు. దీనిపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరి సలహాలు కూడా మాకు అవసరం లేదు. విరాట్, రోహిత్ ఫామ్ పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. మేము సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నామని” గంభీర్ వ్యాఖ్యానించాడు.
మండిపడ్డ రికీ పాంటింగ్
గంభీర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. పాంటింగ్ స్పందించాడు. ” విరాట్ కోహ్లీపై నేను విమర్శలు చేయలేదు. ఆరోపణలు అంతకన్నా చేయలేదు. అతని ఆట తీరును మాత్రమే ప్రస్తావించాను. కొంతకాలంగా అతడు చేస్తున్న సెంచరీల సంఖ్య తగ్గిపోయిందని చెప్పాను. అంతేతప్ప నేను వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. నేను మాట్లాడిన మాటలపై గంభీర్ గరంగా వ్యాఖ్యానించాడు. గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియాకు హెడ్ కోచ్. ఆ సోయి అతడికి లేదు.. ఒకవేళ విరాట్ కోహ్లీ నన్ను అడిగినప్పటికీ ఇలాంటి సమాధానమే చెబుతాను. గతంలో అతడు సూపర్ ఫామ్ లో ఉండేవాడు. కానీ ఇప్పుడు తన పూర్వపు ఆట తీరును ప్రదర్శించలేకపోతున్నాడు. వైఫల్యాల గురించి చెప్తే విమర్శించినట్టు కాదు. కించపరచినట్టు అంతకన్నా కాదు. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. అయితే ఈసారి అతడు చెలరేగడానికి అవకాశం ఉంది.. అయితే ఇవన్నీ మర్చిపోయి గౌతమ్ గంభీర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం నాకు ఆశ్చర్యం అనిపించింది. గంభీర్ గల్లి స్థాయి ఆటగాడు కాదు.. టీమ్ ఇండియాకు హెడ్ కోచ్. ఆ విషయాన్ని మర్చిపోతే ఎలా అంటూ” పాంటింగ్ చురకలంటించాడు. భారత్ – ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కి ముందు పాంటింగ్, గంభీర్ మధ్య ఇలా వాదోపవాదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.