Rohit Sharma: ఏ రంగంలో అయినా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారంటే.. వారి వెనకాల కొంత అదృష్టం కూడా ఉండాలంటారు మన పెద్దవారు. ఇప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌ను చూస్తే ఒక పాత సామెత మనకు గుర్తుకు రాక మానదేమో. ఇప్పుడు రోహిత్ సాధిస్తున్న విజయాలను చూస్తుంటే అతను నిజంగానే నక్కతోక తొక్కాడేమో అనిపిస్తుంది. మొన్నటికి మొన్న వన్ డే మ్యాచ్‌ను వైట్ వాష్ చేసింది రోహిత్ సేన.
ఇప్పుడు కోల్కత్తా వేదికగా జరిగిన మూడో టీ20లోనూ వెస్టిండీస్పై గెలిచింది టీమ్ ఇండియా. దాదాపు 17 రన్స్ తేడా విజయ ఢంకా మోగించింది. టీ20 సిరీస్‌ను కూడా వైట్ వాష్ చేసేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా.. 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 184 రన్స్ సాధించింది. సూర్యాకుమార్ యాదవ్ పరుగుల వరద పారించాడు. 31 బంతుల్లో ఏకంగా 65 పరుగులు చేయడం, అతనికి సాయంగా వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 35 రన్స్ బాదడంతో ఇండియా చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది.
Also Read: అభిమానులకు క్లాస్ ఇచ్చిన పవన్.. అధికారం కోసం తప్పదు మరీ?
ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ వరుసగా వికెట్లు పోగొట్టుకుంది. కాగా వారిలో నికోలస్ పూరన్ కాస్తంత భయపెట్టాడు. 47 బంతుల్లో 61 రన్స్ చేసి గౌరవం కాపాడాడు. కానీ టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి కుప్ప కూలిపోయింది వెస్ట్ ఇండీస్. దీంతో రోహిత్ కెప్టెన్సీలో వరుసగా టీ20కూడా వైట్ వాష్ చేసేసింది ఇండియా. దీంతో అతనికి ప్రశంసల వెల్లువ దక్కుతోంది.
అసలే భీకర బ్యాట్స్ మెన్ అయిన విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్‌కు కెప్టెన్సీ అప్పగించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. గొప్ప ఆటగాడిని ఇలా అవమానిస్తారా అంటూ చాలా ట్రోల్స్ నడిచాయి. కానీ ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో వైట్ వాష్ గెలుపులు చూసిన సదరు క్రికెట్ అభిమానులు రోహిత్‌కు సపోర్టు చేస్తున్నారు. అతనికి మద్దతు తెలుపుతున్నారు. మొన్నటి దాకా విమర్శించిన వారే ఇప్పుడు రోహిత్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా లక్ అంటే ఇదేనేమో కదా.
Also Read: ఏపీకి తాయిలాలు ఇవ్వడానికి బీజేపీ రెడీయేనా?