https://oktelugu.com/

Pawan Kalyan- Tollywood: సినీ పరిశ్రమ వేడుకోళ్లపై పవన్ వ్యాఖ్యల కలకలం.. చిరంజీవి వంగివంగి దండాలపైనేనా?

Pawan Kalyan- Tollywood: ఉన్న‌ది ఉన్న‌ట్లు కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడ‌టం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అల‌వాటు. ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ క‌ష్టాలు తీర్చాల‌ని స‌భ్యులంతా జ‌గ‌న్ కోరిన సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వారిపై ఘాటుగా స్పందించారు. స‌మ‌స్య‌లు తీర్చాల‌ని కోర‌డంలో త‌ప్పులేదు కానీ వంగివంగి దండం పెట్ట‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. స‌మ‌స్య‌లు తెచ్చేది వారే వాటిని ప‌రిష్క‌రించిన‌ట్లు చేసేది వారే అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ ఇప్పుడేమంత క‌ష్టాల్లో లేద‌ని తెలుస్తోంది. అయినా […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 21, 2022 / 10:55 AM IST
    Follow us on

    Pawan Kalyan- Tollywood: ఉన్న‌ది ఉన్న‌ట్లు కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడ‌టం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అల‌వాటు. ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ క‌ష్టాలు తీర్చాల‌ని స‌భ్యులంతా జ‌గ‌న్ కోరిన సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వారిపై ఘాటుగా స్పందించారు. స‌మ‌స్య‌లు తీర్చాల‌ని కోర‌డంలో త‌ప్పులేదు కానీ వంగివంగి దండం పెట్ట‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. స‌మ‌స్య‌లు తెచ్చేది వారే వాటిని ప‌రిష్క‌రించిన‌ట్లు చేసేది వారే అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

    Pawan Kalyan-YS Jagan

    చిత్ర‌ప‌రిశ్ర‌మ ఇప్పుడేమంత క‌ష్టాల్లో లేద‌ని తెలుస్తోంది. అయినా సీఎం జ‌గ‌న్ కు మోక‌రిల్ల‌డం ఎందుక‌ని త‌నలోని ఆగ్ర‌హం వెల్ల‌గ‌క్కారు. అన‌వ‌స‌ర విష‌యాల‌ను అత్య‌వ‌స‌ర‌మైన‌విగా భావిస్తూ ఎవ‌రిపైనో ఆధార‌ప‌డి చిత్ర ప‌రిశ్ర‌మ లేద‌ని చెబుతున్నారు. ఆత్మాభిమానం ఉండాల‌ని సూచిస్తున్నారు. ప‌రోక్షంగా చిరంజీవిని ఉద్దేశించినా ఎక్క‌డ కూడా ఆయ‌న పేరు బ‌య‌ట‌కు రాకుండా మాట్లాడారు.

    Also Read:  ఏపీకి తాయిలాలు ఇవ్వ‌డానికి బీజేపీ రెడీయేనా?

    పులికి ఆక‌లేస్తే గ‌డ్డి తిన‌ద‌ని మ‌నం కూడా స‌మ‌స్య‌ల్లో ఉన్నంత మాత్రాన ఎవ‌రికో దండం పెడుతూ అడుక్కోవ‌డ‌మేమిట‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌లు తీర్చాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వంపై ఉన్నా తామేదో చేస్తున్న‌ట్లు గొప్ప‌ల‌కు పోవ‌డం విడ్డూర‌మే. దీంతో చిత్ర‌ప‌రిశ్ర‌మ పెద్ద‌లు ఏదో చేసిన‌ట్లుగా పోజులివ్వ‌డం మిన‌హా జ‌రిగిందేమిట‌ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

    దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వైసీపీ నేత‌లు సైతం ప‌వ‌న్ కు కౌంట‌ర్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఒక ప‌క్క చిత్ర పరిశ్ర‌మ కోసం అంద‌రు పాటుప‌డుతుంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలా మాట్లాడ‌ట‌మేమిట‌నే అభిప్రాయాలు కూడా సినీవ‌ర్గాల్లో వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో సినిమా ప‌రిశ్ర‌మ కోసం ఓ ప‌క్క అంద‌రు ప‌ని చేస్తుంటే మ‌రోప‌క్క ప‌వ‌న్ కల్యాణ్ విమ‌ర్శ‌లు అంద‌రిలో అనుమానాలు క‌లిగిస్తున్నాయి.

    Pawan Kalyan, chiranjeevi , jagan

    ఇదివ‌ర‌కే గ‌తంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ ప్ర‌భుత్వం సినిమాల విష‌యంలో క‌లుగ‌జేసుకోవ‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నిస్తే ఎవ‌రు కూడా ప‌వ‌న్ కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేదు. దీంతో ఇప్పుడు ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టే వారే ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. అయినా తాను అనుకున్న‌ది చేస్తారు? మ‌న‌సులో ఉన్న‌ది చెప్ప‌డం ప‌వ‌న్ కల్యాణ్ నైజం. దీంతోనే ఆయ‌న ప‌రిశ్ర‌మ‌లో ఒంట‌రిగా మిగిలిపోతున్నారు.

    జ‌గ‌న్ క‌లిసే సంద‌ర్భంలో సినీ ప్ర‌ముఖుల తీరుపైనే ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌లు చేశారు. దీనికి ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు సైతం గ‌ళం విప్పారు. జ‌గ‌న్ తో మాట్లాడే సంద‌ర్భంలో అతి విన‌యం ఎందుక‌ని అడుగుతున్నారు. ప‌రిశ్ర‌మ‌కు కావాల్సిన సాయం చేయ‌డంలో త‌ప్పు లేదు కానీ వంగివంగి న‌మ‌స్కారాలు పెట్ట‌డంలో ఆంత‌ర్య‌మేమిట‌ని ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. మొత్తానికి సినీ ప్ర‌ముఖుల వ్య‌వ‌హారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

    Also Read:  పవన్ మేనియా.. ఇక రికార్డ్స్ అన్నీ చెల్లాచెదురే

    Tags