Sunrisers Hyderabad: అలసత్వం.. అష్ట దరిద్రాలతో జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ విఫలం!

ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌లో పరవా లేదు అనిపించిన ఆటగాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక్క క్లాసెన్‌. ఇతడిని మినహా మిగిలిన ప్లేయర్లందరినీ వదిలేసినా ఫర్వాలేదు అనే ధోరణికి అభిమానులు వచ్చేశారు.

Written By: Raj Shekar, Updated On : June 2, 2023 12:35 pm

Sunrisers Hyderabad

Follow us on

Sunrisers Hyderabad: ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన జట్టు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌. ఇక ఐదు వరుస పరాజయాలతో టోర్నీని ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. సన్‌ రైజర్స్‌ కంటే మెరుగైన స్థానంలోన నిలవడం విశేషం. ఐపీఎల్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటతీరు ఏడాదికి ఏడాది మరీ అధ్వానంగా మారుతోంది. 2021 నుంచి పేలవ ప్రదర్శన చేస్తోంది. 2021లో అట్టడుగు స్థానంలో నిలిచిన హైదరాబాద్‌.. 2022లో 8వ స్థానంలో నిలిచింది. ఇక 2023లో మరోసారి పేలవ ప్రదర్శనతో 10వ స్థానానికి పరిమితం అయ్యింది.

నెగ్గింది నాలుగే..
ఐపీఎల్‌లో ప్రతీ జట్టు 14 లీగ్‌ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో అతి తక్కువగా హైదరాబాద్‌ జట్టుకేవలం నాలుగు విజయాలను నమోదు చేసింది.

గందరగళ నిర్ణయాలు..
ముఖ్యంగా ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌ తీసుకున్న నిర్ణయాలు గందరగోళంగా మారాయి. కోట్లు పెట్టి తెచుకున్న ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ను ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడించి ఆ తర్వాత పక్కనపెట్టేశారు. ఇక వరుసగా విఫలం అయిన ఉమ్రాన్‌ మాలిక్‌ చేత ఏకంగా 8 మ్యాచ్‌లు ఆడించింది. మైదానం బయట ఓనర్లు.. మైదానంలో టీం తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.

గల్లీ టీం కన్నా ఆధ్వానంగా..
ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ మ్యాచ్‌కు ప్లేయింగ్‌ ఎలెవెన్‌ను మారస్తూ గల్లీ టీమ్‌ను తలపించింది. ఇక ఆశలు పెట్టుకున్న మార్కో యాన్సెన్, ఎయిడెన్‌ మార్క్రమ్, రాహుల్‌ త్రిపాఠి, మయాంక్‌ అగర్వాల్‌ దారుణంగా విఫలమయ్యారు.

పర్వాలేదనిపించిన క్లాసెన్‌..
ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌లో పరవా లేదు అనిపించిన ఆటగాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ఒక్క క్లాసెన్‌. ఇతడిని మినహా మిగిలిన ప్లేయర్లందరినీ వదిలేసినా ఫర్వాలేదు అనే ధోరణికి అభిమానులు వచ్చేశారు. ఇక హెడ్‌ కోచ్‌ బ్రియాన్‌ లారా, బౌలింగ్‌ కోచ్‌ డేల్‌ స్టెయిన్, ఫీల్డింగ్‌ కోచ్‌ హేమాంగ్‌ బదాని పనితీరుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటే వారిని సరి చేయాల్సిన స్టెయిన్‌ డగౌట్‌లో ఏదో సినిమా చూస్తున్నట్లు నవ్వుతూ కనిపించాడు. ఇక లారా కూడా ఇదే పద్ధతిని పాటించాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మారుస్తూ ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీశాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ రాత మారాలంటే..
వచ్చే సీజన్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ రాత మారాలంటే.. కోచింగ్‌ టీమ్‌ను మొదట మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే టీమ్‌ను కంటిన్యూ చేసినా ఫర్వాలేదు కానీ.. అలసత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌ గా ఉన్న కోచింగ్‌ను మాత్రం తప్పుకుండా మార్చాల్సిందే. అలా అయితే ఫలితం వేరేలా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెస్ట్‌ ప్లేయర్‌ అయిన లారా, ఆటగాళ్లకు టెస్ట్‌ మ్యాచ్‌ కోచింగ్‌ ఇచ్చాడన్న విమర్శలు ఉన్నాయి. అందుకే మేనేజ్‌మెంట్‌ మొదట కోచింగ్‌ టీం మార్పుపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.