Karnataka Free Bus Travel: కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్‌కు హామీల సెగ గట్టిగానే తగులుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలు స్వచ్ఛందంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కొలువుదీరి పది రోజులు కూడా కాకముందే.. ఉచిత విద్యుత్, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి, గృహజ్యోతి, యువ నిధి తదితర ప్రజాకర్షక హామీలు ఇచ్చింది. ఈమేరకు మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం చేసి వారం కూడా తిరగక ముందే.. ఉచిత హామీల డిమాండ్ ఊపందుకుంది. కరెంటు బిల్లు కట్టాలని వచ్చే వారిపై ప్రజలు తిరగబడుతున్నారు. ఇక ఉచిత ప్రయాణం కోసం మహిళలు ఒత్తిడి చేస్తున్నారు. ఇదే సమయంలో విపక్ష బీజేపీ కూడా ప్రజలకు మద్దతు తెలుపుతోంది.
ఒత్తిడి నేపథ్యంలో…
హామీలు నెరవేర్చాలని ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ విధి విధానాల రూపకల్పనలో నిమగ్నమైంది. ఇందు కోసం నెలకు రూ.60 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే ఎంత మందికి ఇవ్వాలి, అర్హులను ఎలా గుర్తించాలి అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో హామీల అమలు జాప్యం అవుతోంది.
పురుషుల బస్సులు..
మహిళల నుంచి ఉచిత ప్రయాణం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సిద్ధరామయ్య సర్కార్.. అక్కడ ఆర్టీసీలో పురుషుల బస్సు ప్రవేశపెట్టింది. మహిళలు బస్సు ఎక్కి టికెట్ తీసుకోవడం లేదు. టికెట్ అడిగితే ప్రభుత్వాన్ని అడగమని అంటున్నారు. కండక్టర్లతో, ఆర్టీసీ అధికారులతో గొడవ పడుతున్నారు. ఈనేపత్యంలో సర్కార్ హామీ అమలు పక్కన పెట్టి పురుషుల కోసం ప్రత్యేక బస్సు ప్రవేశపెట్టింది. మెన్స్ ఓన్లీ అని బోర్డులె పెట్టుకుని తిప్పుతోంది. ఈ నిర్ణయంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకి ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, పురుషుల బస్సులు ప్రవేశపెట్టడం ఏంటని నిలదీస్తున్నారు.
గృహలక్ష్మి కోసం గొడవలు..
ఇక గృహలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2 వేలు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపింది. దీంతో ఇప్పుడు ఈ విషయమై కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఒకరికే రూ.2 వేలు ఇస్తారని ప్రచారం జరుగుతుండడంతో ఉమ్మడి కుటుంబాల్లో ఈ డబ్బులు ఎవరు తీసుకోవాలి, ఎవరి పేరు రాయించాలి అనే విషయంలో విభేదాలు పొడచూపుతున్నాయి. అత్తా కోడళ్లు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. హామీల అమలుకు ముందు ప్రభుత్వానికి ఇన్ని తలనొప్పులు వస్తుండడంతో అమలు చేసిన తర్వాత ఇంకా ఎన్ని ఇబ్బందులు వస్తాయో అని సిద్ధరామయ్య సర్కార్ టెన్షన్ పడుతోంది.
Recommended Video:
