Bumrah hits a yorker : జట్టు స్కోరు మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు తొలి వికెట్ కోల్పోవడంతో గుజరాత్ తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో వచ్చిన కుశాల్ మెండిస్ పది బంతుల్లో 20 పరుగులు చేసి సౌకర్యవంతంగా కనిపించాడు. అయితే శాంట్నర్ బౌలింగ్లో హిట్ వికెట్ గా అవుట్ కావడంతో.. గుజరాత్ ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయింది.. ఈ దశలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు చేసి.. హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చాడు. అత్యంత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని విడదీయడానికి హార్దిక్ పాండ్యా బుమ్రాను రంగంలోకి దింపాడు.. అంతే హార్దిక్ కోరుకున్నట్టుగానే బుమ్రా బౌలింగ్ వేసాడు.. అతడు సంధించిన యార్కర్ ను అడ్డుకోవడానికి సుందర్ గట్టిగానే ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాళ్ళ సందులో నుంచి వెళ్లిపోయిన బంతి వికెట్లను పడగొట్టింది. ఆ బంతిని అడ్డుకునే క్రమంలో చివరికి సుందర్ కూడా కింద పడాల్సి వచ్చింది.
నిన్నటి మ్యాచ్లో సుందర్ వికెట్ పడిన తీరు హైలెట్ గా నిలిచింది. వాస్తవానికి గిల్ – సుందర్ ఉన్నంత సేపు ముంబై జట్టులో ఏమాత్రం ఆశలు లేవు. పాండ్యా నుంచి మొదలుపెడితే రోహిత్ వరకు అందరిలోనూ టెన్షన్ కనిపించింది. చివరికి సుందర్ వికెట్ పడిపోవడం.. అనవసరమైన షాట్ కు ప్రయత్నించి సుదర్శన్ వికెట్ పడేసుకోవడంతో.. ముంబై జట్టు విజయం లాంచనమైంది. ఎప్పుడైతే బుమ్రా సుందర్ వికెట్ పడగొట్టాడో.. ముంబై జట్టు కాస్త స్వేచ్ఛగా కనిపించింది. ఈ దశలో వచ్చిన రూథర్ఫర్డ్ బ్యాట్ ఝుళిపించాడు. కానీ మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడంతో గిల్ జట్టు ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్ లో అశ్విని కుమార్ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ సాధించాడు. తద్వారా ముంబై జట్టు పంజాబ్ తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి అదరగొట్టిన గుజరాత్ ప్లే ఆఫ్ లో ఇంటికి వెళ్లిపోయింది. కీలక దశలో గుజరాత్ గనుక తప్పులు చేయకుండా ఉండి ఉంటే కచ్చితంగా ముంబై మీద గెలిచేది. దర్జాగా పంజాబ్ తో పోటీపడేది.
వాస్తవానికి గుజరాత్ ఈ మ్యాచ్లో గెలిచేదే. చేజింగ్ లో ప్లేయర్లు దూకుడు కొనసాగించారు..గిల్ అవుట్ అయినప్పటికీ సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, మెండిస్ వంటివారు అదరగొట్టినప్పటికీ చివర్లో ముంబై బౌలర్లు రెచ్చిపోవడం.. కీలక దశలో గుజరాత్ ప్లేయర్లు తలవంచడంతో మ్యాచ్ ఒక్కసారిగా హార్దిక్ సేన వైపు టర్న్ అయింది. గుజరాత్ చేసిన తప్పులు హార్దిక్ సేనకు లాభంగా మారాయి. ఫలితంగా ప్లే ఆఫ్ లో గుజరాత్ జట్టుకు కన్నీళ్లు.. ముంబై జట్టుకు ఆనందభాష్పాలు మిగిలాయి.
THE GREATEST, THIS IS JASPRIT BUMRAH ERA pic.twitter.com/TP3mhqcfqS
— Johns. (@CricCrazyJohns) May 30, 2025
