AP DSC 2025 Schedule Changed : ఏపీ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఆన్ లైన్ పరీక్షల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ వెల్లడించింది ఏపీ ప్రభుత్వం. జూన్ 6 నుంచి 30 వరకూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత జూన్ 6 నుంచి జూలై 6 వరకూ..30 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో అధికారులు షెడ్యూల్ మార్చారు. పరీక్షల నిర్వహణను 24 రోజులకు కుదించాయి. మరోవైపు హాల్ టిక్కెట్ల జారీ ప్రక్రియ ఆన్ లైన్ లో ప్రారంభమైంది. ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవడంతో అక్కడ కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు అధికారులు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఒడిశాలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు అధికారులు చెబుతున్నారు. పరీక్ష కేంద్రాల ఎంపిక ఆప్షన్ ను అభ్యర్థులకు ఇచ్చారు. ఎక్కువ మందికి వారు ఎంచుకున్న కేంద్రాలనే కేటాయించారు.
భారీ స్థాయిలో పోస్టులతో..
రాష్ట్ర వ్యాప్తంగా 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేశారు. మే 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. 30 నుంచి హాల్ టికెట్ల జారీ ప్రక్రియకు అనుమతి ఇచ్చారు. ప్రధానంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రిన్సిపల్స్ వంటి పోస్టులు ఈ డీఎస్సీలో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం అని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి పోస్టులు అధికంగా ఉన్నాయి. కానీ అంతకుమించి పోటీ కూడా ఉంది. లక్షలాదిమంది ఉపాధ్యాయ కొలువుల కోసం అహోరాత్రులు శ్రమించారు. అయితే భారీగా పోస్టులు ప్రకటించడం పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలకు కేవలం ఆరు రోజులు మాత్రం గడువు ఉండడంతో అన్నిరకాల సంసిద్ధులు అవుతున్నారు.
Also Read : రోజుకు 40 వేల మంది డిఎస్సీ పరీక్ష.. రేపటి నుంచి హాల్ టికెట్లు!
ఎన్నికల్లో హామీ మేరకు..
వైఎస్సార్ కాంగ్రెస్ హయాలంలో డీఎస్సీ ప్రకటన రాలేదు. ఎన్నికలకు ముందు ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ భర్తీ ప్రక్రియ ప్రారంభంకాకుండానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ అలుముకుంది. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ( Mega DSC) ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు. మొత్తం 16347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేశారు. మే 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఒక వైపు హాల్ టిక్కెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నెల రోజుల పాటు పరీక్షల నిర్వహణ ఉంటుందని అంతా భావించారు. కానీ 24 రోజులకు కుదించి నిర్వహించనున్నారు. కాగా కేంద్రాల ఏర్పాటులో అధికారులు నిమగ్నమయ్యారు. బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే వీలైనంత త్వరగా డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేసి ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.