RCB : 2008లో ఐపీఎల్ మొదలైతే ఇప్పటివరకు.. ఒక్కసారి కూడా విజేత కాలేని దురదృష్టం బెంగళూరు జట్టుది.. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నా.. విరాట్ లాంటి మ్యాచ్ విన్నర్ ఉన్నా బెంగళూరు కప్ సొంతం చేసుకోలేకపోయింది. ఎప్పటికప్పుడు ఈసారి కప్ మాదే అంటూ గొప్పలు పోవడం, ఆ తర్వాత ఓడిపోయి ఇంటికి వెళ్లిపోవడం బెంగళూరు జట్టుకు పరిపాటిగా మారింది.
ఈసారి మాత్రం బెంగళూరు జట్టు ఆట తీరు సరికొత్తగా కనిపిస్తోంది. ప్రతి విషయంలోనూ విభిన్నంగా దర్శనమిస్తోంది. దీంతో బెంగళూరు అభిమానులు ఈసారి కచ్చితంగా కప్ గెలుస్తామనే ఆశతో ఉన్నారు..అంతేకాదు సోషల్ మీడియాలో కూడా తమ జట్టుకు సంబంధించిన ప్లేయర్లను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఆటగాళ్లు కూడా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గడం లేదు.. తమకంటే మేటి జట్లతో జరిగిన మ్యాచ్లలో.. అనితర సాధ్యమైన ప్రదర్శన చేస్తూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఏమాత్రం తగ్గేది లేదున్నట్టుగా పరుగుల సునామి సృష్టిస్తున్నాడు. ఇక బెంగళూరు జట్టు ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో ఏకంగా ప్లే ఆఫ్ దాకా వెళ్ళిపోయింది. పాయింట్ల పట్టికలో నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. ప్లే ఆఫ్ అవకాశాలను ప్రారంభం నుంచి సుస్థిరం చేసుకుంది. అద్భుతం జరిగితే తప్ప బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ నుంచి తప్పుకునే అవకాశాలు లేవు. బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ వెళ్లిపోయినప్పటికీ ఆ జట్టు అభిమానులను ఒక అంశం తీవ్రంగా కలతకు గురిచేస్తోంది..ఇంతకీ అది ఏంటంటే.
Also Read : అప్పుడు భారీ కాయుడు.. ఇప్పుడు సన్నబడ్డాడు.. భయ్యా టీమిండియాలో నీకు డోకా లేదు పో!
మే 18న బెంగళూరు జట్టు గత ఏడాది ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. అంతేకాదు విరాట్ కోహ్లీ ఫేవరెట్ నెంబర్ కూడా 18 . అయితే గత ఏడాది మే 18న బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ వెళ్లిపోయిన తర్వాత సెమీస్ దాకా చేరుకోలేకపోయింది. దీంతో ఐపీఎల్ ట్రోఫీని సాధించాలి అనే కలను నెరవేర్చుకోకుండానే ఇంటిదారి పట్టింది. అయితే ఈసారి కూడా బెంగళూరు జట్టు మే 18న ప్లే ఆఫ్ వెళ్ళిపోయింది. దీంతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జరుగుతుందా? అని అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.” ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని అనుకుంటున్నాం..ఆటగాళ్లు కూడా అదే విధంగా ఆడుతున్నారు. మేనేజ్మెంట్ కూడా కనీవిని ఎరుగని స్థాయిలో ప్రచారం చేస్తోంది. దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణకు ఈసారి తెర దించాలని బలంగా కోరుకున్నాం. ఆటగాళ్లు మా ఆశలను సజీవంగా ఉంచుతారా? లేదా? అనేది ఇప్పటికి భయంగానే ఉంది. ఎందుకంటే గత సీజన్లో మా జట్టు మే 18న ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. ఆ తదుపరి దశలో ఓటమిపాలై ఇంటికి వచ్చింది. ఈసారి కూడా మే 18 తారీఖున ప్లే ఆఫ్ వెళ్ళిపోయింది..మరి ఈసారి ఏం జరుగుతుందో
అనేది అర్థం కావడం లేదు. ఇప్పటివరకు మా జట్టు కప్ గెలవలేదు. కాబట్టి మాలో ఇలాంటి భయాలు చాలా ఉన్నాయని” బెంగళూరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.