Bellamkonda Srinivas : మాస్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) అల్లుడు అదుర్స్ చిత్రం తర్వాత మాయమైపోయిన సంగతి తెలిసిందే. ఈయన నుండి ఒక్క తెలుగు సినిమా కూడా రాలేదు. మధ్యలో ఆయన బాలీవుడ్ లోకి వెళ్లి ప్రభాస్ ‘ఛత్రపతి’ సినిమాని రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇప్పుడు ఆయన కొంత గ్యాప్ తీసుకొని ‘భైరవం'(Bhairavam Movie) చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గరుడన్’ చిత్రానికి ఇది రీమేక్. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటించారు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల అవ్వగా, దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముగ్గురు హీరోలు కూడా సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది.
Also Read : ‘హరి హర వీరమల్లు’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం తేదీ వచ్చేసింది..ఫ్యాన్స్ కి పండగే!
అలాంటి ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుండడం కాస్త థ్రిల్ కి గురి చేస్తున్న విషయం. ట్రైలర్ చూస్తుంటే ఈ ముగ్గురు హీరోలకు కం బ్యాక్ చిత్రం అయ్యేలా అనిపిస్తుందని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 30 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే తాను హిందీ లో చేసిన ‘ఛత్రపతి’ మూవీ కలెక్షన్స్ ని హీరో రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ సినిమాలతో పోలుస్తూ బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడడం ఇప్పుడు పెద్ద వివాదాలకు దారి తీసింది. సోషల్ మీడియా లో రామ్(Ram Pothineni ), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అభిమానులు బెల్లంకొండ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
ఆయన ఏమి మాట్లాడాడంటే ‘కరోనా లాక్ డౌన్ తర్వాత మన ఆడియన్స్ మైండ్ సెట్ బాగా మారిపోయింది. వాళ్ళ మైండ్ సెట్ అలా మారిపోయింది అనే విషయం నాకు అవగాహన లేక ఛత్రపతి ని హిందీ లో రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాను. ఆ తర్వాత మారిన పరిస్థితులను గమనించాను. ఇప్పుడు ఈ రీమేక్ చేయడం చాలా రిస్క్ అనిపించింది. కానీ కమిట్ అయ్యాను కాబట్టి చేయాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని నాకు, రామ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి, రవితేజ గారికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందని చెప్పి ఒకరు నాతో ఒప్పించారు. సినిమా విడుదలై ఫ్లాప్ అయ్యింది కానీ, రామ్, విజయ్ దేవరకొండ హిందీ డబ్ సినిమాలకంటే ఎక్కువ రెండింతలు ఎక్కువ వసూళ్లను రాబట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. హిందీ లో నాకు మొదటి నుండి మంచి మార్కెట్ ఉందని ఆయన మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
