RCB vs LSG : ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు, లక్నో జట్ల మధ్య మంగళవారం రాత్రి లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో బ్యాటింగ్ మొదలుపెట్టింది. మైదానంపై తేమ ఉండడంతో బెంగళూరు బౌలర్లను లక్నో ఆటగాళ్లు ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా డికాక్ చాలా రోజుల తర్వాత లక్నో జట్టుకు టచ్ లోకి వచ్చాడు. అతడు 56 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 20 పరుగులు చేసి మాక్స్ వెల్ బౌలింగ్లో మయాంక్ దగర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత పడిక్కల్ వన్ డౌన్ బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో అనూజ్ రావత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ దశలో మార్కస్ స్టోయినిస్(24; 15 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు) అండగా నిలవడంతో డికాక్ స్వేచ్ఛగా ఆడాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతోందనుకుంటున్న దశలో బెంగళూరు జట్టు స్కోరు 129 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు స్టోయినిస్ మాక్స్ వెల్ బౌలింగ్ లో మాయంక్ దగర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత నికోలస్ పురాన్(40; 21 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సులు) బెంగళూరు బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. అతడు ఉన్నంతసేపు లక్నో జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అప్పటికే ఓవర్లు పూర్తి కావడంతో లక్నో జట్టు ఐదు వికెట్లకు 181 పరుగులు చేసింది.
బెంగళూరు బౌలర్లలో మాక్స్ వెల్ 2 వికెట్లు పడగొట్టాడు. టోప్లే, యష్ దయాల్, మహమ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. వాస్తవానికి బ్యాటింగ్ దిగిన లక్నో జట్టు 5.3 ఓవర్ల లోనే 53 పరుగులు చేసింది. రాహుల్, డికాక్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో లక్నో జట్టు స్కోరు పరుగులు పెట్టింది. 5.3 ఓవర్ వద్ద మాక్స్ వెల్ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మాక్స్ వెల్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన రాహుల్ మయాంక్ దగర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన దేవదత్ పడిక్కల్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 11 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి బెంగుళూరు స్కోర్ 8.5 ఓవర్లలో 73. ఈ దశలో స్టోయినిస్, డికాక్ మూడో వికెట్ కు దాదాపు 56 పరుగులు జోడించారు. వీరిద్దరూ కాసేపు ఉండి ఉంటే బెంగళూరు స్కోరు సులభంగా 200 దాటేది. జోరు మీద ఉన్న స్టోయినిస్ ను మాక్స్ వెల్ అవుట్ చేశాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన పురన్ పూనకం వచ్చినట్టే ఆడాడు. జట్టు స్కోరు 143 పరుగుల వద్ద డికాక్ అవుట్ కావడంతో.. పురన్ బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఏకంగా 40 పరుగులు చేశాడు. అప్పటికే ఓవర్లు పూర్తి కావడంతో లక్నోస్కోరు ఐదు వికెట్ల నష్టానికి 181 పరుగుల వద్ద ముగిసింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ 16 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 22 పరుగులు చేశాడు. కోహ్లీ సిద్ధార్థ బౌలింగ్లో దేవదత్ పడిక్కల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ డూప్లెసిస్19 పరుగులు, రజత్ పాటిదార్ ఒక పరుగుతో క్రీజ్ లో ఉన్నారు. బెంగళూరు విజయం సాధించాలంటే 89 బంతుల్లో 140 పరుగులు చేయాల్సి ఉంది.