Chiranjeevi – Savitri : మహానటి సావిత్రి గారి గొప్పతనాన్ని తెలియజేస్తూ సంజయ్ గారు రాసిన ‘సావిత్రి క్లాసిక్స్’ అనే బుక్ ని లాంచ్ చేయడానికి నిర్వహించిన ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ గారు ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఇక ఈ బుక్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా సావిత్రి గారి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆమెతో తనకున్న అనుబంధాన్ని కూడా చిరంజీవి సభాముఖంగా పంచుకున్నారు. ఇక తన మొదటి సినిమా అయిన ‘పునాదిరాళ్లు ‘ సినిమా కోసం సినిమా డైరెక్టర్ తనని ఎంపిక చేశారట. ఆ సినిమా షూటింగ్ రాజమండ్రిలో ఉంటుందని చిరంజీవికి చెప్పారట. ఇక ఈ సినిమాలో ఎవరెవరు ఉంటారు అనే విషయం కూడా చిరంజీవికి క్లారిటీగా తెలియదట. కానీ ఒక నలుగురు కుర్రాళ్ళు ఉంటారు.
అందులో నరసింహారాజు మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడనే విషయాన్ని మాత్రమే చెప్పి వీళ్ళందర్నీ ట్రైన్ లో ఎక్కించి రాజమండ్రి కి తీసుకెళ్లారట. ఇక చిరంజీవి రాజమండ్రి కి వెళ్లే ప్రాసెస్ లో సినిమా యూనిట్ ద్వారా ఒక విషయం తెలిసిందట అదే ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా సావిత్రి గారు నటిస్తుందని. అలాగే ఆ సినిమా దర్శకుడు కూడా చిరంజీవి తో నీకు సావిత్రి గారి కాంబినేషన్ లో కొన్ని సీన్లు ఉన్నాయని చెప్పారట. దాంతో ఒక్కసారిగా చిరంజీవి బాడీలో వైబ్రేషన్స్ స్టార్ట్ అయిందట. ఎందుకంటే ఇప్పటిదాకా తన ఆరాధ్య నటిగా ఉన్న సావిత్రి గారిని ఎప్పుడు స్క్రీన్ మీద చూడడమే తప్ప డైరెక్టుగా చూసింది లేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఆమె పక్కన నటించే అవకాశం రావడంతో చిరంజీవి కొద్దిసేపటి వరకు ఆ హై లోనే ఉన్నాడంట.
దాంతో చిరంజీవి అలాగే సినిమా యూనిట్ అంతా సావిత్రి గారి దగ్గరికి వెళ్లారట. ఇక అప్పుడే డైరెక్టర్ చిరంజీవిని సావిత్రి గారికి పరిచయం చేశాడట. ఆమె నీ పేరేంటి అని అడిగితే ఏమని చెప్పాలో అర్థం కాలేదట. ఎందుకంటే అప్పుడే శివశంకర వరప్రసాద్ గా ఉన్న పేరు ను అలాగే చిరంజీవిగా మార్చుకుంటున్న క్రమంలో తన పేరుని ఏమని చెప్పాలి అని అనుకుండట కానీ మొత్తానికైతే చిరంజీవి అని చెప్పారట.అది విని మంచి పేరు అని సావిత్రి గారు కాంప్లిమెంట్ కూడా ఇచ్చినట్టుగా చిరంజీవి చెప్పారు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో జరగాల్సిన షూట్ కోసం లొకేషన్ కి వెళ్ళగానే అక్కడ వర్షం పడుతుందని సినిమా యూనిట్ అంతా ఖాళీగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అక్కడున్న మిగతా ఆర్టిస్టులు అయిన రోజారమణి, నరసింహారాజు లాంటి నటీనటులకు సావిత్రి చిరంజీవిని పరిచయం చేసి ఈయన డాన్స్ బాగా వేస్తాడు అని చెప్పిందంట. దాంతో వాళ్ల కాలక్షేపం కోసం వాళ్ళు చిరంజీవిని డాన్సులు చేయమన్నారు. దాంతో చిరంజీవి ఎప్పుడు ఒక టేప్ రికార్డర్ ని కూడా తన వెంట పెట్టుకుంటూ ఉండేవారట.
దాంట్లో ఒక సాంగ్ ప్లే చేసి డాన్స్ చేస్తూ వాళ్ళందర్నీ అలరించారట. అలాగే ఆ వర్షానికి తడిసిన ఫ్లోర్ జారడంతో చిరంజీవి కింద పడ్డాడట. ఇక దాన్ని కవర్ చేసుకోవడానికి అక్కడ నాగిని డాన్స్ లాంటిది కూడా వేస్తూ వాళ్ళందర్నీ అలరించారట. చిరంజీవి డ్యాన్స్ చేసిన సావిత్రి గారు ఫ్యూచర్ లో నువ్వు చాలా గొప్ప నటుడి అవుతావు అంటూ దీవించిందట.
ఇలా చిరంజీవి సావిత్రి గారి గురించి గొప్పతనాన్ని చెబుతూనే ఇప్పుడు నేను సావిత్రి గారి బుక్ ని లాంచ్ చేయడానికి రావడం అనేది నిజంగా నా అదృష్టం అని కూడా చెప్పారు. ఇక ఈ వెంట లో చిరంజీవి దంపతులతో పాటు మురళీమోహన్, బ్రహ్మనందం, తనికెళ్ళ భరణి, జయసుధ, అల్లు అరవింద్ లాంటి ఇంకా కొంత మంది సినీ పెద్దలు పాల్గొని ఈ ఈవెంట్ ను విజయ వంతం చేశారు…