CM Chandrababu (6)
CM Chandrababu: ఏపీలో ( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. గత పది నెలలుగా అనేక రకాల ఇబ్బందులు ఎదురైనా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. రాజకీయంగా క్లిష్ట సమయంలో సహకారం అందించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య ఇబ్బందులు వచ్చినా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో 15 ఏళ్ల పాటు పొత్తు కొనసాగాలని బలంగా కోరుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. అయితే వారి మధ్య బంధం కూడా అలానే ఉంది. ప్రత్యేక సందర్భాల్లో అది బయటపడుతూనే ఉంది. తాజాగా మద్రాస్ ఐఐటీ లో జరిగిన సమావేశంలో చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. అందులో పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.
Also Read: రాజీవ్ యువ వికాసం.. అర్హతలు.. నిబంధనలు ఇవే!
మద్రాస్ ఐఐటి ( Madras IIT)ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు వెళ్లారు. విద్యార్థులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. మద్రాస్ ఐఐటీ లో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులే ఉంటారు. ఈ తరుణంలో సీఎం చంద్రబాబును చూసినవారు కేరింతలు కొట్టారు. చప్పట్లతో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు తెలుగు ప్రసంగం చేశారు. ఏపీ అభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే విద్యార్థుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గురించి కూడా రెండు మాటలు మాట్లాడారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* విద్యార్థుల కోరిక మేరకు..
సాధారణంగా పెద్ద స్థాయి నేతలు ఎవరు ఇతర రాష్ట్రాలు, ఇతర వేదికల వద్ద మిగతా వారి గొప్పతనం గురించి పెద్దగా ప్రస్తావించరు. కానీ చంద్రబాబు( Chandrababu) మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు బాలయ్య బాబు పై ప్రశంసలు కురిపించారు. హౌ ఇస్ పవన్ కళ్యాణ్, బాలయ్య అంటూ విద్యార్థులు కేకలు వేయడంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని ఆపి వారి గురించి స్పందించారు. సినిమాలతో పాటు ప్రజా జీవితంలో బిజీగా ఉన్నారు అంటూ సమాధానం చెప్పారు చంద్రబాబు. వారు స్ఫూర్తివంతమైన వ్యక్తులుగా అభిప్రాయపడ్డారు. దీంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లు, కేరింతలతో మార్మోగిపోయింది. చంద్రబాబు కామెంట్స్ వైరల్ అయ్యాయి.
* చంద్రబాబు కీలక ప్రసంగం..
మద్రాస్ ఐఐటీ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి పై మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. విద్యార్థుల పాత్ర తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. గతంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ప్రసంగానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.