https://oktelugu.com/

MS Dhoni : ఎంఎస్ ధోనికి అంత కోపమా.. వీడియో వైరల్

ధోని హడావిడిగా వెళ్లిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2024 / 04:50 PM IST

    RCB vs CSK: MS Dhoni left after CSK lost against RCB

    Follow us on

    MS Dhoni : అది 2011.. ముంబైలోని వాంఖడే స్టేడియం.. శ్రీలంక, భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం చేజింగ్ ప్రారంభించిన ఇండియా.. లక్ష్యాన్ని సాధించింది. విన్నింగ్ షాట్ ను సిక్స్ రూపంలో ధోని కొట్టాడు. దీంతో స్టేడియం మొత్తం అరుపులు, కేకలు, గోలలు. విన్నింగ్ షాట్ కొట్టిన ధోనిలో మాత్రం ఎటువంటి హావాభావాలు లేవు. ఇప్పుడు మాత్రమే కాదు 2007లో టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు.. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నెగ్గినప్పుడు.. ధోని ఇటువంటి హంగామా చేయలేదు. మిస్టర్ కూల్ లాగా ఉన్నాడు. అప్పుడే కాదు చాలా సందర్భాల్లోనూ ధోని నిశ్శబ్దాన్నే ఆశ్రయిస్తాడు. పెద్దగా హడావిడిని ఇష్టపడడు. అటువంటి ధోని.. శనివారం చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో.. బెంగళూరు చేతిలో చెన్నై ఓడిపోవడంతో కోపంతో మైదానాన్ని వీడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను హల్ చల్ చేస్తోంది.

    బెంగళూరు తో మ్యాచ్ అనంతరం ధోని మైదానం నుంచి తొందరగా వెళ్ళిపోయాడు. బెంగళూరు ప్లేయర్లకు కరాచలనం ఇవ్వలేదు. తనకు ఎదురు వచ్చిన కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ధోని కి పట్టరాని కోపం వచ్చిందని.. అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ధోనిలో ఇలాంటి కోణం కూడా ఉందని ఇప్పుడే తెలిసిందని.. చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని కొంతమంది అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. క్రీడా స్ఫూర్తి గురించి పదే పదే చెప్పే ధోని.. ఇలా వ్యవహరించడం ఏంటని విమర్శిస్తున్నారు.

    ఇక మరికొందరేమో ధోని కాలి నొప్పితో బాధపడుతున్నాడని.. అందువల్లే త్వరగా వెళ్లిపోయాడని వ్యాఖ్యానిస్తున్నారు. తన వయసు 42 సంవత్సరాల అని.. కాళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ ధోని ఆడాడని.. నొప్పిని తట్టుకోలేక అతడు వెంటనే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి పోయాడని కొంతమంది అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ధోనికి ఎప్పుడూ కోపం రాదని.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తాడని.. అతని గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిమానులు పేర్కొంటున్నారు. ధోని హడావిడిగా వెళ్లిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి.