RCB Vs CSK: 10 సెకండ్ల వీడియోతో ఓవర్ నైట్ స్టార్.. ఇంతకీ ఎవరా యువతి?

సోషల్‌ మీడియా జమానాలో ఉన్నాం మనం. మన ఇంటి పక్కన ఉన్న వారు ఒక్క డాన్స్, సాంగ్, ఏదైనా వీడియోతో స్టార్ అయితే తప్ప వారు మన ఇంటి పక్కన ఉంటారని తెలియని కాలంలో మనం ఉన్నాం.

Written By: Neelambaram, Updated On : May 20, 2024 4:45 pm

RCB Vs CSK

Follow us on

RCB Vs CSK: జమానా మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని సెకండ్ల నిడివి ఉన్న వీడియో కూడా స్టార్ లుగా మారుస్తుంది. ఈ వీడియోలకు ప్రపంచ వేదికలు తోడైతే ఇంకేముంది వరల్డ్ వైడ్ స్టార్ అయిపోవడమే. అలాంటిదే ఇక్కడ ఒక వీడియో వైరల్ గా మారి ఆ యువతిని ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సోషల్‌ మీడియా జమానాలో ఉన్నాం మనం. మన ఇంటి పక్కన ఉన్న వారు ఒక్క డాన్స్, సాంగ్, ఏదైనా వీడియోతో స్టార్ అయితే తప్ప వారు మన ఇంటి పక్కన ఉంటారని తెలియని కాలంలో మనం ఉన్నాం. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది బాత్రూమ్ సింగర్స్ ఫేమస్ సింగర్లుగా, రోడ్ డ్యాన్సర్లు డాన్స్ షోల జడ్జీలుగా మారిపోయారు. ఇదంతా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇందులో ఓవర్ నైట్ స్టార్ హోదా దక్కించుకున్న వారిని ఎంతో మందిని మనం చూశాం.

ప్రపంచం ఇప్పుడు ఐపీఎల్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐపీఎల్ కు సంబంధించి గ్రౌండ్ ఎంత ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ స్టేడియం కూడా. స్టేడియంలో కూర్చున్న వారి కదలికలను కెమెరా మెన్లు జాగ్రత్తగా కెమెరాలో బంధిస్తున్నారు.

ఇటీవల జరిగిన ఐపీఎల్‌ లో CSK వర్సెస్ RCB మ్యాచ్ జరిగింది. ఈ మ్యచ్ మొత్తం ఎంత రసవత్తరంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాచ్‌ లో CSK 36 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉండగా అందరూ ఇంట్రస్టింగ్ గా మ్యాచ్ ను చూస్తున్నారు. ఇటు CSK అటు RCB ఫ్యాన్స్ ఎవరికి వారు తమ జట్టే గెలవాలని స్టేడియంలోనే దేవుడిని మొక్కు కుంటున్నారు.

ఇంత ఉత్కంఠ మైన సిచ్చువేషన్ లో కెమెరా మెన్ ఫోకస్ ఒక అమ్మాయి వైపునకు మళ్లింది. ఇంకేముందు ఆయన కన్నే కెమెరా కన్నుగా మారింది. దీంతో ఆ అమ్మాయి కెమెరాలో బంధించబడింది. ఆ అమ్మాయి ఆనందంగా డాన్స్ చేస్తుంది. కేవలం 10 సెకన్ల పాటే ఉన్న ఆమె డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఆమె అందానికి, ఆమె నవ్వుకు, ఆమె డాన్స్ కు ఇలా వేర్వేరుగా లక్షల్లో నెటిజన్స్ ఫిదా అవుతూ ఆ వీడియోను కోట్లలో షేర్‌ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఇంతకీ ఆ అందమైన యువతి CSK ఫ్యాన్‌ అయి ఉంటుందా..? లేక RCB ఫ్యాన్ అయి ఉంటుందా..? అనే చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా 10 సెకండ్ల డ్యాన్స్ తో వరల్డ్ వైడ్ పాపులర్ అయిన ఆమె అందాన్ని మెచ్చుకోవాలో.. కెమెరామెన్ ను మెచ్చుకోవాలో.. లేదంటే వీడియోను తీసుకువచ్చిన సోషల్ మీడియాను మెచ్చుకోవాలో తెలియకున్నారు యూత్.