Ram Charan-NTR: రామ్ చరణ్ లో ఎన్టీయార్ కి నచ్చేది ఏంటో తెలుసా..?

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు త్రిబుల్ ఆర్ సినిమాలో కలిసి నటించారు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ డూపర్ సక్సెస్ అయినప్పటికీ రామ్ చరణ్ పాత్రకి ఎక్కువ పేరు వచ్చిందని...

Written By: Gopi, Updated On : May 20, 2024 4:46 pm

Do you know what NTR likes in Ram Charan

Follow us on

Ram Charan-NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇండస్ట్రీ లో మెగా నందమూరి ఫ్యామిలీలకు విపరీతమైన గుర్తింపు అయితే ఉంది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఫ్యామిలీల్లో ఈ రెండు ఫ్యామిలీలు చాలా పెద్ద ఫ్యామిలీలు గా చెప్పుకోవచ్చు. ఇక ఈ కుటుంబాల నుంచి ఉన్న హీరోల్లో చాలా మంది ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు త్రిబుల్ ఆర్ సినిమాలో కలిసి నటించారు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ డూపర్ సక్సెస్ అయినప్పటికీ రామ్ చరణ్ పాత్రకి ఎక్కువ పేరు వచ్చిందని ఎన్టీయార్ కి తక్కువ పేరు వచ్చిందని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే వైరల్ అయ్యాయి. ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దగ్గజ నటులు కూడా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెష్ ను తెలియజేసినట్టుగా చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ కి తన బర్త్ డే విషెస్ ని తెలియజేసాడట. ఇక త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ సమయంలో వీళ్ళిద్దరూ చాలా రోజులు కలిసి ట్రావెల్ చేశారు. కాబట్టి అప్పుడు వీళ్ళ మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడిందట. ఇక ఎన్టీఆర్ కి రామ్ చరణ్ లో కొన్ని విషయాలు అంటే చాలా ఇష్టమట. అదేంటి అంటే ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడు. ఏదైనా చేయాలి అనుకుంటే డిలే లేకుండా చాలా ఫాస్ట్ గా చేసేస్తాడట.

అలాగే తన తోటి వారిని చాలా బాగా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడని ఒక ఇంటర్వ్యూలో ఎన్టీయార్ రామ్ చరణ్ లో తనకు నచ్చిన క్వాలిటీస్ గురించి ఇలా తెలియజేశాడు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు పిల్లర్ల లాంటి వారని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు…