Ayush Mathre : చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఒక చేదు జ్ఞాపకం. అయితే ఈ సీజన్లో చెన్నై జట్టుకు ఆణిముత్యం దొరికింది. అతని పేరు ఆయుష్ మాత్రే. 17 సంవత్సరాల ఈ కుర్రాడు బెంగళూరు జట్టుకు చుక్కలు చూపించాడు. ఉన్నంతసేపు మైదానంలో పరుగుల వరద పారించాడు. 48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో ఆయుష్ 94 పరుగులు చేశాడు. మరో ఆరు పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుందనగా.. అవుట్ అయ్యాడు. ఒక రకంగా ఆయుష్ చెన్నై జట్టు ఇన్నింగ్స్ కు బలమైన పునాది వేశాడని చెప్పవచ్చు. ప్రత్యర్థి జట్టు విధించిన 200+ స్కోర్ ను చేదించడంలో ఆయుష్ తనదైన మార్క్ ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఆరు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ.. జట్టు ఇన్నింగ్స్ లో ముఖ్య భూమిక పోషించాడు. తద్వారా అరుదైన రికార్డును ఆయుష్ సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ వయసులో హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితా ఒకసారి పరిశీలిస్తే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటాన్స్ పై సూపర్ సెంచరీ చేశాడు. 14 ఇయర్స్ ఏజ్ లోనే అతడు ఈ ఘనత అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పై హాఫ్ సెంచరీ చేశాడు. అప్పుడు అది వయసు 17 సంవత్సరాల 175 రోజులు. 2025లో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు ఆయుష్ 17 ఇయర్స్ ఏజ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజు శాంసన్ 2013లో 18 సంవత్సరాల 169 రోజుల వయసులో బెంగళూరు జట్టుపై ఆఫ్ సెంచరీ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృద్వి షా 2018లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు పై 18 సంవత్సరాల 169 రోజుల వయసులో అర్థ శతకం చేసాడు. ఇక ఈ మ్యాచ్లో చెన్నై జట్టు తరుపున బెంగళూరు పై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా నిలిచారు. ఈ జాబితాలో శివం దుబే – రాబిన్ ఊతప్ప తొలి స్థానంలో ఉన్నారు. 2022లో జరిగిన మ్యాచ్లో మూడో వికెట్ కు శివం దుబే – రాబిన్ ఊతప్ప 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక 2011లో మైక్ హస్సీ, మురళి విజయ్ తొలి వికెట్ కు 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 2025లో జరిగిన మ్యాచ్లో మూడో వికెట్ కు ఆయుష్, రవీంద్ర జడేజా 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 2009లో మాథ్యూ హెడెన్, పార్థివ్ పటేల్ తొలి వికెట్ కు 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
THE MADNESS OF AYUSH MHATRE…!!! https://t.co/QomicKet2x
— Johns. (@CricCrazyJohns) May 3, 2025