RCB Victory Parade : కన్నడ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అభిమానుల్లో హర్షం నింపింది. దీంతో బెంగళూరు నగరంలో సంబరాలు అంతకుమించి అనే స్థాయిలో నిర్వహించాలని అభిమానులు భావించారు. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. ట్రోఫీ సాధించిన నేపథ్యంలో తమ జట్టు ఘనతను ప్రపంచం నలుమూలల చాటాలని అనుకున్నారు. బెంగళూరు అభిమానులు ఒక విధంగా అనుకుంటే.. బెంగళూరు నగర పోలీసులు మరో విధమైన ప్రకటన చేశారు. ఆ స్థాయిలో అభిమానులు బెంగళూరు నగరంలోకి వస్తే.. ఏదైనా జరగరాని సంఘటన చోటు చేసుకుంటే తాము కట్టడి చేయలేమని నగర పోలీసులు స్పష్టం చేశారు.. దీంతో విక్టరీ పరేడ్ జరగదని అందరూ ఒక అంచనాకొచ్చారు. అయితే బెంగళూరు జట్టు యజమాన్యం ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పోలీస్ శాఖకు భద్రత కల్పించాలని సూచించడంతో.. బెంగళూరు పోలీసులు విక్టరీ పరేడ్ కు ఒప్పుకున్నారు.. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు చేశారు.
Also Read : బెంగళూరు కు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది? ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు ఎవరికి దక్కాయంటే!
వాస్తవానికి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెప్పి బెంగళూరు పోలీసులు విక్టరీ పరేడ్ కు ఒప్పుకోలేదు. పైగా ఇప్పుడు కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. ఆ స్థాయిలో జనం భారీగా వచ్చేస్తే ఇబ్బంది ఎదురవుతుందని స్పష్టం చేశారు. అంతమంది అభిమానులు ఒకేసారి రోడ్డుమీదికి వస్తే కట్టడి చేయలేమని.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే ఇబ్బంది పడక తప్పదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల కోణంలో ఇది సబబుగానే కనిపిస్తున్నప్పటికీ.. బెంగళూరు యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగావదిలిపెట్టలేదు. నేరుగా ప్రభుత్వం వద్దకు వెళ్లడంతో.. ప్రభుత్వ పెద్దలు ఈ పరేడ్ నిర్వహించడానికి ఒప్పుకున్నారు. బెంగళూరు నగర పోలీసులతో సమావేశమై.. భద్రత కల్పించాలని సూచించారు.
బెంగళూరు పోలీసులు ఒప్పుకున్న నేపథ్యంలో కన్నడ జట్టు యాజమాన్యం కీలక సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేసింది.. అభిమానులు నిబంధనలు పాటిస్తూ విక్టరీ పరేడ్ పాల్గొనాలని సూచించింది. సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియం వరకు నిర్వహించే విక్టరీ పరేడ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రవర్తించాలని రాయ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం సూచించింది.. ఎటువంటి రుసుము వసూలు చేయకుండానే అభిమానుల కోసం పాసులను కన్నడ జట్టు యాజమాన్యం అందుబాటులో ఉంచింది. కన్నడ జట్టు అధికారిక వెబ్ సైట్ లో ఎటువంటి రుసు వసూలు చేయకుండా మంజూరు చేసే shop.royalchallengers.com లో సంప్రదించాలని పేర్కొంది.. బెంగళూరు నగర పోలీసులు విక్టరీ పరేడ్ కు అనుమతించిన నేపథ్యంలో కన్నడ ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ఈ పరేడ్ విజయవంతంగా నిర్వహించడానికి కన్నడ జట్టు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకమైన బస్సులో అభిమానులతో గంటపాటు కర్ణాటక శాసనసభ నుంచి చిన్నస్వామి క్రికెట్ మైదానం వరకు పరేడ్ నిర్వహించనుంది.