RCB Victory Parade Controversy : కన్నడ జట్టు దాదాపు దశాబ్దానికి మించిన నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకుంది. ఒకరకంగా ఇది శుభ పరిణామం. మంచి విషయం కూడా. ఇలాంటి సందర్భాన్ని గట్టిగా జరుపుకోవాలని కూడా.. దానిని ఎవరు తప్పు పట్టరు కూడా. కానీ సెలబ్రేట్ చేసుకునే విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తేనే అసలు సమస్య ఎదురవుతుంది. వాస్తవానికి నిన్న అహ్మదాబాద్ లో గెలిచిన తర్వాత కన్నడ జట్టు ఆటగాళ్లు బెంగళూరు వచ్చేసారు. బెంగళూరు మేనేజ్మెంట్ తమ ఐపిఎల్ విజయాన్ని పురస్కరించుకొని విక్టరీ పరేడ్ నిర్వహించాలని భావించింది. ఈ విషయాన్ని బెంగళూరు నగర పోలీసులకు తెలియజేస్తే వారు సున్నితంగా తిరస్కరించారు. ఆ స్థాయిలో అభిమానులు గనుక రోడ్లమీదకి వస్తే కట్టడి చేయడం కష్టమని ముందే చెప్పేశారు.. దీంతో తమ రాజకీయ పలుకుబడిని ప్రయోగించిన బెంగళూరు జట్టు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఎలాగైనా సరే తన బల ప్రదర్శన చూపించాలని బెంగళూరు యాజమాన్యం గట్టిగా ఫిక్స్ అయింది. దీంతో బెంగళూరు నగర పోలీసులు చేసేదేం లేక.. కొన్ని నిబంధనలు విధించి.. విక్టరీ పరేడ్ నిర్వహించుకోవచ్చని చెప్పారు.
Also Read: విక్టరీ పరేడ్ కు బెంగళూరు పోలీసుల అనుమతి.. ఫ్రీ పాసులు ఎలా పొందాలంటే?
ఇక విక్టరీ పరేడ్ లో పాల్గొనడానికి వచ్చిన కన్నడ జట్టు ఆటగాళ్లకు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వాగతం పలికారు. వారికి పుష్ప గుచ్చాలు అందించి విధాన సభ వద్దకు తోడుకొని వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేకమైన బస్సులో కన్నడ ఆటగాళ్లు చిన్నస్వామి స్టేడియం వద్దకు బయలుదేరారు. దీంతో అభిమానులు భారీగా రోడ్లమీదకి రావడంతో.. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం పోలీసులకు సవాల్ అయిపోయింది. అసలే బెంగళూరు నగర రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి. పైగా సాయంత్రం సమయంలో విపరీతమైన రద్దీగా ఉంటాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం తప్ప వేరే మార్గం లేకపోవడంతో.. దానిని పోలీసులు అమలు చేశారు. అయితే కీలకమైన రోడ్డు కావడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. దీంతో పోలీసులు రోడ్లమీద ఉన్న అభిమానులను చెదర గొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అభిమానులు ఒకరి మీద ఒకరు పడిపోయారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఫలితంగా తొక్కి సలాట చోటుచేసుకుంది. దీంతో నలుగురు అభిమానులు చనిపోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
వాస్తవానికి బెంగళూరు జట్టు మీద అభిమానులకు విపరీతమైన ప్రేమ ఉంటుంది. కొందరి ప్రేమ ఉన్మాదాన్ని మించి ఉంటుంది. ఈ పదాన్ని రాయడానికి ఎటువంటి ఇబ్బంది మాకు లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో బెంగళూరు అభిమానులు ఎలాంటి కామెంట్ చేస్తారో మేము చూస్తూనే ఉంటాం. పైగా బెంగళూరు జట్టు గెలిచిన నాటి నుంచి వారు సోషల్ మీడియాలో ఎలా రెస్పాండ్ అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అభిమానులు భారీగా రోడ్లమీదకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి తోడు ఉచితంగా అందించే పాసుల విషయంలోనూ అభిమానుల మధ్య గొడవ చోటుచేసుకుంది. అది కాస్త తొక్కిసలాటకు కారణమైంది. అందువల్లే ఇద్దరు అభిమానులు చనిపోయారని తెలుస్తోంది. అయితే ఇంతటి దారుణం జరిగినప్పటికీ బెంగళూరు యాజమాన్యం ఇంతవరకు ఒక ప్రకటన చేయలేదు. పోలీసులు బందోబస్తు పేరుతో అభిమానుల మీద లాఠీలతో తమ కాఠిన్యాన్ని ప్రదర్శించడం విశేషం..
అభిమానులు భారీగా రావాలని.. విక్టరీ పరేడ్లో పాల్గొనాలని సూచించిన బెంగళూరు యాజమాన్యం.. చనిపోయిన అభిమానుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతుంది.. వెర్రి క్రికెట్ పిచ్చితో తమ ప్రాణాలు కోల్పోయిన ఆ యువకులకు ఎలాంటి భరోసా కల్పిస్తుంది.. అందువల్లే అభిమానం ఒక స్థాయి వరకే ఉండాలి. వారు కూడా మనలాగే మనుషులే. వారేమీ అతీంద్రియ శక్తులు కాదు. పైగా ఈ స్థాయిలో అభిమానం చూపిస్తే మనకు వారు బదులుగా ఏమీ ఇవ్వరు. వారు డబ్బుల కోసం మాత్రమే క్రికెట్ ఆడుతున్నారు. డబ్బుల కోసం మాత్రమే బెంగళూరు జట్టు యాజమాన్యం ఐపీఎల్లో ఆడుతోంది. అంతే తప్ప దేశ సేవ కోసం కాదు. సమాజ ఉద్ధరణ కోసం అంతకన్నా కాదు.
View this post on Instagram