Motorola best phones under budget: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola ఇటీవల Edge 70 fusion మొబైల్ ను ఆవిష్కరించింది. అయితే అంతకుముందు కూడా ఎన్నో రకాల మొబైల్స్ ఈ కంపెనీ నుంచి మార్కెట్లో ఉన్నాయి. కొత్తగా మొబైల్ కొనడానికి ఇష్టపడని వారు ఇదివరకే మార్కెట్లోకి వచ్చిన మోటరోలా ఫోన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దీంతో కొంతమంది మోటరోలా కంపెనీ నుంచి ఇదివరకు ఉన్న ఫోన్లో ఏవి? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇంతకుముందు ఉన్న ఫోన్లో ఫీచర్లు కూడా హైలెట్ గా ఉండడంతో వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అసలు మోటోరోలా కంపెనీ నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
2026 January నెలలో అందుబాటులోకి వచ్చిన Motorola Signature మొబైల్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 సాఫ్ట్వేర్ ఉంచారు. మల్టీ టాస్కింగ్ కోసం ఈ సాఫ్ట్వేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో 12 GB రామ్ ఉండనుంది. 6.8 అంగుళాల AMOLED డిస్ప్లేతో ఆకట్టుకుంటుంది. 50 MP మెయిన్ కెమెరా.. 50 MP ఫ్రంట్ కెమెరా ఉండడంతో అన్ని వర్గాల వారికి ఈ మొబైల్ ఆకట్టుకునే విధంగా ఉంది దీనిని రూ.53,887 ప్రారంభ ధరలతో విక్రయిస్తున్నారు.
మోటరోలా ఎడ్జ్ 70 Fusion మొబైల్ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఇందులో స్నాప్ డ్రాగన్ 7 S Gen 4 సాఫ్ట్వేర్ ఉండనుంది. 8 GB రామ్ తో పని చేస్తుంది. 50 ఎంపీ మెయిన్ కెమెరా 32 MP ఫ్రంట్ కెమెరాతో ఆకట్టుకుంటుంది. ఇందులో 7000 mAh బ్యాటరీ ఉండగా.. దీనికి 68 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. 6.8 అంగుళాల AMOLED డిస్ప్లే ఉన్న ఈ మొబైల్ ను రూ.24,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఫ్లిప్కార్ట్ స్టోర్ లో ఇది అందుబాటులో ఉంది.
Moto G67 Power మొబైల్ కూడా వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుంది. మిడ్ రేంజ్ పీపుల్స్ కు ఇది అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దీని ధర రూ.15,787 గా ఉంది. ధర తక్కువగా అయినప్పటికీ ఇందులో టీచర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ మొబైల్లో స్నాప్ డ్రాగన్ 7 S Gen 2 ప్రాసెసర్ ఉండగా 8 GB Ram తో పనిచేస్తుంది. 50 MP మెయిన్ కెమెరా.. 32 MP ఫ్రంట్ కెమెరా ఉండడంతో సెల్ఫీ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఈ మొబైల్లో 7000 mAh బ్యాటరీ ఉండగా దీనికి 30 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. 6.7 అంగుళాల LCD డిస్ప్లే కలిగిన ఈ మొబైల్ అమెజాన్ లో అందుబాటులో ఉంది.
Motorola Edge 60 Pro మొబైల్ సైతం ప్రీమియం వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. దీని ధర రూ.28,490 గా ఉంది. ఇందులో మీడియా టెక్ dimensity 8350 తో పనిచేస్తుంది. అలాగే 8 GB రామ్ ఉండనుంది.