RCB vc CSK : విరాట్ ప్రతీకారం.. మిచెల్ విచారం.. ఎగిరి గంతేసిన అనుష్క..

ఇదే సమయంలో విరాట్ తన ప్రతీకారాన్ని కూడా తీర్చుకున్నాడు. మిచెల్ విరాట్ పట్టిన క్యాచ్ ద్వారా అవుట్ కావడంతో.. అతడి భార్య అనుష్క శర్మ స్టాండ్స్ లో ఎగిరి గంతేసింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written By: NARESH, Updated On : May 19, 2024 1:51 pm

Virat-Kohli-and-Daryl-Mitchell

Follow us on

RCB vc CSK : కీలకమైన ప్లే ఆఫ్ వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో.. బెంగళూరు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. బలమైన చెన్నై జట్టుపై 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో దర్జాగా ప్లే ఆఫ్ వెళ్ళింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 218 రన్స్ చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన చెన్నై 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 27 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. నువ్వా, నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో.. అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా చెన్నై బ్యాటింగ్ కు దిగినప్పుడు అనేక సంచలనాలు నమోదయ్యాయి. అందులో చెన్నై ఆటగాడు మిచెల్ అవుట్ అయిన విధానం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.

218 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన చెన్నై జట్టుకు.. ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. చెన్నై జుట్టు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు.. మూడో ఓవర్ లో సిరాజ్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ మిడ్ అఫ్ వద్ద పట్టిన క్యాచ్ తో అతడు కూడా వెనుదిరిగాడు. అప్పటికి చెన్నై జట్టు కేవలం 19 పరుగులు మాత్రమే చేసింది. వెంట వెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో.. చెన్నై జట్టు మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర, మరో ఆటగాడు అజింక్యా రహానే ఇంకో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయినప్పటికీ కీలక సమయంలో వీరిద్దరూ అవుట్ కావడంతో చెన్నై జట్టుకు కష్టాలు తప్పలేదు.

అంతకుముందు బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేసింది.. విరాట్ కోహ్లీ, డూ ప్లెసిస్ ఓపెనర్లుగా బరిలోకి దిగి.. బెంగళూరు జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించారు.. మొదటి మూడు ఓవర్లలో 31 పరుగులు చేశారు. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అనంతరం పునః ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ తనకు మాత్రమే సాధ్యమైన స్లాగ్ స్వీప్ ద్వారా బౌండరీలు సాధించాడు. 29 బంతుల్లో 47 పరుగులు చేసి, అర్థ సెంచరీ వైపుగా వెళ్తున్న విరాట్ కోహ్లీని మిచెల్ శాంట్నర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత డూ ప్లెసిస్ గేర్ మార్చి దూకుడుగా ఆడాడు. అర్థ సెంచరీ సాధించాడు. భారీ స్కోర్ దిశగా వెళ్తున్న అతడు 13 ఓవర్లో అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా 54 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

తనను అర్థ సెంచరీ చేయకుండా మిచెల్ అవుట్ చేయడంతో.. కోహ్లీ నిరాశతో మైదానాన్ని వీడాడు. మిచెల్ ను ఎలాగైనా అవుట్ చేయాలని మనసులో అనుకున్నాడు. అర్థ సెంచరీ ముందు విరాట్ అవుట్ కావడంతో.. అతని భార్య అనుష్క శర్మ కూడా నిరాశకు గురైంది. ఈ క్రమంలో చెన్నై జట్టు బ్యాటింగ్ కు దిగింది. పరుగులేమీ చేయకుండానే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయ్యాడు. ఈ దశలో మిచెల్ వన్ డౌన్ బ్యాటర్ గా క్రీజ్ లోకి వచ్చాడు. అయితే అతడు సిరాజ్ బౌలింగ్ లో విరాట్ పట్టిన క్యాచ్ కు వెనుతిరిగాడు. ఇదే సమయంలో విరాట్ తన ప్రతీకారాన్ని కూడా తీర్చుకున్నాడు. మిచెల్ విరాట్ పట్టిన క్యాచ్ ద్వారా అవుట్ కావడంతో.. అతడి భార్య అనుష్క శర్మ స్టాండ్స్ లో ఎగిరి గంతేసింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.