KA Paul: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా.. ఏపీ రాజకీయాలలో అప్పుడప్పుడు మెరిసే వ్యక్తిగా కేఏ పాల్ పరిచయమే. సోషల్ మీడియాలో కేఏ పాల్ కు విపరీతమైన పాపులారిటీ ఉంది. ఏపీలో ఏదైనా సమస్య సంభవించినప్పుడు.. ఇంకా ఏదైనా విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కేఏ పాల్ బయటికి వస్తారు. ఆయన చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతారు. ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసిన కేఏ పాల్ పట్టించుకోరు.. ఆయన ధోరణిలో మాట్లాడి వెళ్లిపోతారు.. ఆ తర్వాత జుట్టు పీక్కోవడం పాత్రికేయుల వంతవుతుంది. ఇలాంటి సందర్భాలు అనేకం ఎదురైనప్పటికీ పాత్రికేయులకు తప్పదు కాబట్టి… పైగా పాల్ మాట్లాడే మాటలను జనం విపరీతంగా చూస్తారు కాబట్టి.. వారికి తప్పదు. ఇక ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వివాదంగా మారింది. దీనిపై కేఏ పాల్ ఇప్పటికే మాట్లాడారు. గురువారం కూడా మాట్లాడారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
Also Read: పవన్ నీడలా వెంటాడుతున్న ప్రకాష్ రాజ్.. తాజాగా సంచలన ట్వీట్!
ఆయన అన్నారంటూ..
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన కేఏ పాల్.. సంచలన ఆరోపణలు చేశారు..” ఆయన ఆ మాంసం తింటానని చెప్పారు. దేవుడి దగ్గర వాళ్ళ అమ్మగారి దీపం పెడితే.. వాళ్ల నాన్నగారు సిగరెట్ వెలిగించుకునేవారు అని ఆయన చెప్పారు.. ఆయన పిల్లలు బాప్టిజం తీసుకున్నారని ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుంబిగించారు. ఇన్ని చెప్పిన వ్యక్తి సనాతన ధర్మం కోసం.. దాని పరిరక్షణ కోసం బయలుదేరడమే ఆశ్చర్యంగా ఉందని” పాల్ వ్యాఖ్యానించారు.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న సమయంలో.. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కేఏ పాల్ చూపించారు.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కేఏ పాల్ తను అనుకున్న మాటలే సమాధానంగా చెప్పారు. ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. మీడియా ప్రతినిధులపై ఎదురు దాడికి దిగారు. మొత్తంగా కేఏ పాల్ మరోసారి తన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారారు. ఇక సోషల్ మీడియాలో అయితే కేఏ పాల్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను వైసీపీ శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో జనసేన నాయకులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. చివరికి వైసిపి నాయకులకు కేఏ పాల్ మాట్లాడిన మాటలు దిక్కుగా మారాయి అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ” కేఏ పాల్ కు మతిభ్రమించింది. ఏదేదో మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తి మాట్లాడిన మాటలకు మీడియా ఎందుకు ప్రాధాన్యం ఇస్తుందో అర్థం కాదు. ఇప్పటికైనా కేఏ పాల్ మంచి ఆసుపత్రిలో చూపించకుంటే బాగుంటుందని” జనసేన పార్టీ నాయకులు హితవు పలుకుతున్నారు.
రిపోర్టర్: #PawanKalyan బీఫ్ తింటాడని అన్నారు.@KAPaulOfficial : పవన్ కళ్యాణే చెప్పాడు… “నేను బీఫ్ తింటాను, నేను క్రిస్టియన్‌ను, నేను బాప్టిజమ్ తీసుకున్నాను. మా అమ్మ దీపారాధన చేస్తే.. మా నాన్న సిగరెట్ వెలిగించుకునేవాడు” అని ఆయనే చెప్పాడు. నేను అనడం లేదు.#janasenaparty pic.twitter.com/ig1XQzvOMK
— greatandhra (@greatandhranews) April 3, 2025