Hill Hold Control: కొంతమందికి సాహస యాత్రలు అంటే ఇష్టం. బైక్స్, కార్లతో కొండలను ఎక్కాలని తహతహలాడుతుంటారు. అలాంటి వాళ్ల కోసం కొన్ని కార్లు ప్రత్యేకంగా తయారు చేసినవి మార్కెట్లో ఉన్నాయి. కాకపోతే కొన్ని కార్లలో చిన్నపాటి కొండలు, ఎత్తులు ఎక్కడానికి కొన్ని కార్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు.అలాంటి అద్బుతమైన ఫీచర్ ఏంటి.. అది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. మీ ప్రయాణంలో కొండ దారులు మిమ్మల్ని భయపెడుతున్నాయా? బ్రేక్ తీయగానే కారు వెనక్కి రివర్స్ లో వస్తుందా? అయితే మీ కారులో ఉన్న ఈ అద్భుతమైన ఫీచర్ మీకు బెస్ట్ ఫ్రెండ్ లాంటిది! అదే హిల్ హోల్డ్ కంట్రోల్. ఇది ఎలా పనిచేస్తుంది, ఇది మీ డ్రైవింగును ఎలా ఈజీ చేస్తుందో చూద్దాం.
Also Read: దేశం గర్వించే క్షణం.. భారత సాంస్కృతిక వారసత్వానికి అరుదైన గుర్తింపు
కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లకు సాయంగా ఉండేందుకు కారులో ఓ అద్భుతమైన ఫీచర్ ఉంటుంది. దాని పేరే హిల్ హోల్డ్ కంట్రోల్. కొత్త కారు కొనేటప్పుడు ఈ ఫీచర్ ఉందో లేదో తప్పకుండా చూసుకోవాలి. ఈరోజు ఈ సేఫ్టీ ఫీచర్ ఎలా పనిచేస్తుంది. ఇది ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం.
హిల్ హోల్డ్ కంట్రోల్ అంటే ఏమిటి?
హిల్ హోల్డ్ కంట్రోల్‌ను హిల్ అసిస్ట్ కంట్రోల్ అని కూడా అంటారు. ఈ ఫీచర్ గురించి కారును నడుపుతున్న వాళ్లకు తెలిసే ఉంటుంది. ఇది ఒక డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్. నిటారుగా ఉండే కొండ దారుల్లో కారు డ్రైవింగ్‌ను సులభతరం చేస్తుంది. చాలాసార్లు ఇలాంటి రోడ్లపై బ్రేక్ వేయాల్సి వస్తుంది. బ్రేక్ మీద కాలు తీయగానే కారు వెనక్కి దొర్లడం మొదలవుతుంది. అలాంటి సమయంలో ఈ అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్ బ్రేక్ నుండి కాలు తీసిన తర్వాత కూడా కారు వెనక్కి జారకుండా కాపాడుతుంది.
హిల్ హోల్డ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుంది?
నిటారుగా ఉండే ఎత్తుపై హఠాత్తుగా బ్రేక్ వేయాల్సి వస్తే, సాధారణంగా బ్రేక్ తీయగానే కారు వెనక్కి జారుతూ వస్తుంది. కానీ, హిల్ హోల్డ్ కంట్రోల్ ఫీచర్ ఉన్న కార్లలో బ్రేక్ వదిలి యాక్సిలరేటర్ తొక్కే మధ్యలో ప్రెషర్‌ను నింపుతుంది. దీనివల్ల కారు వెనక్కి రాదు. ఈ ఫీచర్ డ్రైవర్‌కు కొంచెం ఎక్కువ సమయం ఇస్తుంది. దానితో మీరు యాక్సిలరేటర్ తొక్కడం ద్వారా కారును ముందుకు తీసుకెళ్లవచ్చు. మీరు కారును ముందుకు కదిలించగానే ఈ ఫీచర్ ప్రెషర్‌ను రిలీజ్ చేస్తుంది.
హిల్ హోల్డ్ అసిస్ట్ వల్ల ఉపయోగాలు
నిటారుగా ఉండే కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ ఈజీ అవుతుంది. అలాగే, పట్టణ ప్రాంతాల్లో ఫ్లైఓవర్‌లపై ఎక్కేటప్పుడు హఠాత్తుగా బ్రేక్ వేయాల్సి వస్తే కూడా ఈ ఫీచర్ సహాయపడుతుంది.కారు వెనక్కి జారకుండా చేస్తుంది. దీనివల్ల వెనుక వస్తున్న కారును ఢీకొట్టకుండా ఉంటారు. దీని వల్ల మీ వాహనానికి వెనుక ముందున్న వాహనాలకు నష్టం జరుగదు.