RCB Jersey : బెంగళూరు ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్ లో ఉంది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడిపోయింది.. కోల్ కతా నైట్ రైడర్స్,ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై విజయాలు సాధించింది. మొత్తంగా ఆరు మ్యాచులలో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. బెంగళూరు కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగు విజయాలు సాధించడం వల్ల అగ్రస్థానంలో ఉంది.. ఇక బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ విజయాల పరంగా ఒకే తీరుగా ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ బెంగళూరు కంటే గుజరాత్ జట్టుకు ఎక్కువగా ఉండడంతో.. ఆ జట్టు రెండవ స్థానంలో కొనసాగుతోంది..
Also Read : RCB జెర్సీ గ్రీన్ కలర్ లోకి.. కారణమిదే..
గ్రీన్ కలర్ జెర్సీ వేసుకుంటే చాలు..
బెంగళూరు జట్టు ప్రతి ఐపిఎల్ లో ఒక మ్యాచ్లో గ్రీన్ కలర్ జెర్సీ వేసుకుంటుంది. పర్యావరణ స్పృహను పెంపొందించడానికి.. అభిమానుల్లో పర్యావరణ పరిరక్షణపై కాంక్ష కలిగించడానికి గ్రీన్ కలర్ జెర్సీ వేసుకుంటుంది. అంతేకాదుఆటగాళ్లతో మొక్కలు కూడా నాటిస్తుంది. ఆదివారం నాటి రాజస్థాన్ రాయల్స్ జట్టితో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ కలర్ జెర్సీలో కనిపించారు. ఖతార్ ఎయిర్వేస్ స్పాన్సర్ చేస్తున్న జెర్సీలో ప్యూమా, ఇతర బ్రాండ్ కంపెనీల గుర్తులు కనిపించాయి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్రీన్ కలర్ జెర్సీ వేసుకుంటే చాలు గెలుపులు సాధించినట్టే.. నేటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై బెంగళూరు 9 వికెట్ల తేడాతో గెలిచింది.. 2023లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ కలర్ జెర్సీలో దర్శనమిచ్చారు. ఆ మ్యాచ్ లో కూడా బెంగళూరు ఏడు పరుగుల తేడాతో గెలిచింది. 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు గ్రీన్ కలర్ జెర్సీ వేసుకుంది. ఆ మ్యాచ్ లో 67 పరుగుల తేడాతో గెలిచింది. 2016లో గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ కలర్ జెర్సీ ధరించారు. ఆ మ్యాచ్లో 144 పరుగుల తేడాతో గెలిచారు. 2011లో కొచ్చి టస్కర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఆటగాళ్లు గ్రీన్ కలర్ జెర్సీ వేసుకున్నారు. ఆ మ్యాచ్ లో బెంగళూరు 9 వికెట్ల తేడాతో గెలిచింది.