Ravindra jadeja : ” సుదీర్ఘకాలం నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. గత ఏడాది టీం ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇప్పుడిక వన్డే ఫార్మాట్ కు కూడా వీడ్కోలు పలుకుతాడు. అతడి నిర్ణయం కోసం బీసీసీఐ ఎదురు చూస్తున్నది” ఇవీ ఇటీవల రవీంద్ర జడేజా పై వినిపించిన వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు రవీంద్ర జడేజా కీలక ప్రకటన చేశాడు.
Also Read : నేడు రవీంద్ర జడేజా పుట్టినరోజు..ఈ ఆల్ రౌండర్ గురించి ఆసక్తికర సంగతులు ఇవి..
టీమిండియా 12 సంవత్సరాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 2013లో ధోని ఆధ్వర్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. 2017లో ఫైనల్స్ వెళ్ళినప్పటికీ.. టీమిండియా విజేతకాలేక పోయింది. పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఐసీసీ పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించింది. ఈ ట్రోఫీలో టీమిండియా దుబాయ్ వేదికగా మ్యాచులు ఆడింది. లీగ్ నుంచి మొదలు పెడితే ఫైనల్ వరకు ఓటమి అనేదే లేకుండా ఆడింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా ఐదు జట్లపై వరుస విజయాలు సాధించి ట్రోఫీ అందుకుంది. అజేయమైన రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లలో కీలకమైన స్పిన్ బౌలర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. ఆ దిశగా జాతీయ మీడియా సైతం కథనాలను ప్రసారం చేసింది. చివరి మ్యాచ్లో ఒక వికెట్ పడగొట్టిన జడేజా.. విన్నింగ్ షాట్ కొట్టి టీమ్ ఇండియాను గెలిపించాడు. ఈ క్రమంలో అతడి రిటైర్మెంట్ ప్రకటన ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు ఊహించారు. కానీ వారందరికీ చెంప దెబ్బ కొట్టినట్టు జడేజా సమాధానం ఇచ్చాడు.
తోసి పుచ్చాడు
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ పై రవీంద్ర జడేజా ఎటువంటి ప్రకటన చేయలేదు.. పైగా మ్యాచ్ తెలిసిన అనంతరం తన భార్య, కూతురుతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చాడు. అంతేకాదు రిటైర్మెంట్ పై ఎటువంటి ప్రకటన చేయకుండా వెళ్లిపోయాడు. అయితే తనపై వరుసగా పుకార్లు వస్తున్న నేపథ్యంలో.. వాటికి చెక్ పెట్టాలని రవీంద్ర జడేజా నిర్ణయించుకున్నాడు.. ఇందులో బాగానే సోషల్ మీడియాలో ఒక బోల్డ్ పోస్ట్ చేశాడు. ” అనవసరంగా పుకార్లు చేయొద్దు. అందరికీ ధన్యవాదాలు” అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. కేవలం నాలుగు గంటల నాలుగు పదాల్లోనే తన రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ ఒక్క ప్రకటనతోనే అతడు వన్డేలకు ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించేది లేదని సంకేతాలు ఇచ్చాడు. ఇక రోహిత్ కూడా రిటైర్మెంట్ ప్రకటించబోనని చెప్పిన నేపథ్యంలో 2027 వరకు వీరంతా వన్డే క్రికెట్ ఆడతారని.. టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించేంతవరకు వారు జట్టులోనే ఉంటారని తేలిపోయింది. అంటే ఇంకా రెండు సంవత్సరాలు పాటు జడేజా, రోహిత్ శర్మ, విరాట్ వన్డేలలో కొనసాగుతారు.
Also Read : అభిమానులకు మరో షాక్.. మరో దిగ్గజ టీమిండియా ప్లేయర్ రిటైర్మెంట్