Ravindra Jadeja Birthday : రవీంద్ర జడేజా 348 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. 6506 పరుగులు చేశాడు. 593 వికెట్లు పడగొట్టాడు. 2013 లో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు.. కీలక ఆటగాడిగా ఉన్నాడు. 2024 లో టీమిండియా ఐసిసి టి20 వరల్డ్ కప్ సాధించింది. ఈ జట్టులోనూ రవీంద్ర జడేజా ముఖ్య ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టు సాధించిన విజయాలలో అతడు ముఖ్య భూమిక పోషించాడు. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో గోల్డెన్ బాల్ అందుకున్నాడు. టెస్టులలో 319 వికెట్లు పడగొట్టి, 3,235 పరుగులు చేశాడు. ఇక వన్డేలలో 220 వికెట్లు పడగొట్టి, 2,756 పరుగులు చేశాడు. ముఖ్యంగా 2023లో జరిగిన ఐపీఎల్ లో ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ జట్టుపై హీరోచిత ఇన్నింగ్స్ ఆడి.. చెన్నై జట్టును విజేతగా నిలిపాడు. అంతేకాదు ఆధునిక క్రికెట్లో అసలు సిసలైన ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. ఇటీవల టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత.. పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు.
రిజర్వ్ బెంచ్ కు..
ప్రస్తుతం టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో తలపడుతోంది. ఈ టోర్నమెంట్ కు రవీంద్ర జడేజా ఎంపిక అయ్యాడు. మొదటి టెస్టులో అతడికి ఆడే అవకాశం లభించలేదు. రెండవ టెస్ట్ లోనూ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు. దీంతో అతడిని ఆస్ట్రేలియాతో జరిగిన తుల టెస్టులో ఆడించారు. రెండో టెస్టులోనూ ప్రధాన స్పిన్నర్ గా అవకాశం కల్పించారు. అయితే రవీంద్ర జడేజా ప్రస్తుతం 36వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. బహుశా అది ఇతడికి చివరి సిరీస్ కావచ్చు. అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో వాషింగ్టన్ సుందర్ విఫలమైతే.. మూడో టెస్ట్ కు రవీంద్ర జడేజా కు అవకాశం లభించవచ్చని స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్లో జడేజా తేలిపోయాడు. బ్యాటింగ్ లోనూ విఫలమయ్యాడు. అందువల్లే అతడికి ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ప్లే -11 లో అవకాశం లభించలేదని తెలుస్తోంది. ఒకవేళ గనుక జడేజా న్యూజిలాండ్ సిరీస్లో అదరగొట్టి ఉంటే కచ్చితంగా ప్లే -11 లో చోటు దక్కి ఉండేదని సమాచారం. ఇక ఐపీఎల్ లోనూ జడేజా అదరగొడుతున్నాడు. అతడు ప్రస్తుతం చెన్నై జట్టుకు ఆడుతున్నాడు. 2023 ఐపీఎల్ ఫైనల్ లో అతడు ఆడిన ఇన్నింగ్స్ ప్రతి ఒక్క చెన్నై జట్టు అభిమానికి గుర్తుండే ఉంటుంది.