Ravindra Jadeja: ఇంకో రెండు రోజుల్లో వరల్డ్ కప్ మ్యాచ్ లు అడునున్న నేపథ్యంలో ఇండియా జట్టు చాలా సన్నద్దాలు చేస్తూ ఈసారి వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మొన్న జరిగిన సిరీస్ లను చూసుకుంటే ఇండియాలో ఆడుతున్న ప్లేయర్లు అందరు కూడా మంచి ఫామ్ లోకి వచ్చారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కోహ్లీ, సిరాజ్ ,కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్లు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు ఇక ఓపెనర్లు అయిన రోహిత్ ,గిల్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఇండియా టీం కి ఈసారి వరల్డ్ కప్ పక్క అని అందరూ అనుకుంటున్నారు కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటి అంటే టి20 లో గానీ, ఐపిఎల్ లో గానీ సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ని గెలిపించగల సత్తా ఉన్న రవీంద్ర జడేజా మాత్రం తన అద్భుతమైన ఫామ్ ని చూపించలేకపోతున్నాడు. జడేజా ని మినహా ఇస్తే ఇక ఆల్మోస్ట్ అందరూ ఫామ్ లోకి వచ్చారు. జడేజా మాత్రం బ్యాటింగ్ తో అంత చక్కగా ఆడలేకపోతున్నాడు బౌలింగ్ లో పర్లేదు అనిపించినా కూడా బ్యాటింగ్ లో మాత్రం అంత గొప్పగా ఆడటం లేదు…టి20లో గాని, టెస్టుల్లో గాని అదరగొడుతున్న జడేజా వన్డే ఫార్మాట్ కి వచ్చేసరికి మాత్రం తడబడుతున్నాడు. ఆయన గనక బాగా బ్యాటింగ్ చేయగలిగితే ఇండియా ఈజీగా మ్యాచ్ లు గెలుస్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఒకసారి బ్యాటింగ్ ఫామ్ లోకి వచ్చాడు అంటే ఆ మ్యాచ్ మొత్తం గెలిపించే వరకు ఆయన క్రీజ్ లోనే ఉంటూ చివరలో తన వంతు పాత్ర తన పోషిస్తూ ఉంటాడు. అయితే ఇప్పటివరకు జడేజా ఈ ఇయర్లో 12 ఇన్నింగ్స్ ల్లో బ్యాటింగ్ చేయగా అందులో 27.25 అవరేజ్ తో 189 పరుగులు మాత్రమే చేశాడు. ఇక అతను ఒడిఐ ఫార్మాట్లో 6 కోట్టి దాదాపు సంవత్సరం దాటింది. మొన్న ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్ లో కొట్టిన సిక్స్ తప్ప ఆయన ఈ ఇయర్ లో ఒక సిక్స్ కూడా కొట్టలేదు అంటే ఆయన ఎంత ఫెలవమైనా పర్ఫామెన్స్ ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే జడేజా అన్ని ఫార్మాట్లలో బాగా ఆడుతున్నాడు అలాగే విదేశాల్లో కూడా వన్డేల్లో బాగా ఆడుతున్నాడు కానీ స్వదేశానికి వచ్చేసరికి మాత్రం ఓడిఐ ఫార్మాట్లో రాణించలేకపోతున్నాడు దానికి కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియకపోయినా బ్యాటింగ్ లో కొంతవరకు తను తడబడుతున్నాడు.
ఇక 2020 వ సంవత్సరం లో ఆస్ట్రేలియాలో జరిగిన ఒక మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు.అలాగే 2021 సౌత్ ఆఫ్రికా లో జరిగిన వన్డే మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేశాడు…ఇక విదేశాల్లో మాత్రమే వన్డే ఫార్మాట్ లో తన సత్తా చూపిస్తున్న జడేజా స్వదేశంలో ఎందుకు ఆడటం లేదు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మారింది. ఇక వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా టీమ్ ఆస్ట్రేలియా మీద ఆడుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో జడేజా ఫామ్ లోకి రావాలని అందరూ అనుకుంటున్నారు. తను ఫామ్ లోకి వస్తే టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు…ఈ ఇయర్ ఐపీఎల్ లో కూడా ఆయన పెద్దగా ఫామ్ లో లేడు కానీ ఫైనల్ లో అద్బుతం గా ఆడి చెన్నై ని ఫైనల్ లో గెలిపించాడు. కాబట్టి జడేజా కి ఫామ్ అవసరం లేదు.తను ఆడే మ్యాచ్ కి తన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా అడుతాడు అంటూ మరికొంత మంది సీనియర్ ప్లేయర్ వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…