Ravichandran Ashwin: అశ్విన్ రిటర్మెంట్ పై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడారు. ఎవరికి తగ్గినట్టుగా వారు విశ్లేషణలు చేశారు. అయితే ఇప్పుడు అశ్విన్ తన రిటర్మెంట్ పై తొలిసారిగా స్పందించారు. క్రీడా ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన రిటర్మెంట్ కి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. ” నేను ఏ విషయాన్నైనా సరే పెద్దగా పట్టించుకోను. దాన్ని అదే పనిగా సాగదీయను. జీవితంలో ఇన్ సెక్యూరిటీ అనే ఫీలింగ్ నా మైండ్లో లేదు. ఈరోజు వరకు నాది అనే మైండ్ సెట్ లో ఉంటాను. రేపు అనేది నాది కాదు నాకు తెలుసు. అందువల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మొహమటం పడకుండా అనేక విషయాలను పక్కన పెడతాను. నా గురించి.. నా వ్యక్తిత్వం గురించి జనాలు పెద్దగా వేడుక చేసుకుంటారంటే నమ్మే పరిస్థితిలో ఉండను. నా గురించి చాలావరకు జనం ప్రదర్శించే ఆసక్తిని పెద్దగా పట్టించుకోను. నేను ఆటను మాత్రమే విశ్వసించాను. దానిని మాత్రమే ప్రదర్శించాను. ఎప్పుడైనా సరే నాలో సృజనాత్మకత ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని అనుకుంటాను. అది లేని నాడు ఆటను మొహమాటం లేకుండా వదిలేస్తాను. ఇప్పుడు జరిగింది కూడా అదే. నేను నా ప్రతి భను మొత్తం ఆట మీద మాత్రమే చూపించాను. నా ఆసక్తిని మొత్తం దానిమీద లగ్నం చేశాను. అందువల్లే నా నుంచి విభిన్నమైన నేపథ్యాలు బయటికి వచ్చాయి. ప్రతిభ ఉండడం వల్లే నేను క్రికెట్లో రాణించగలిగాను. ఇతరులకు చెప్పగలిగాను. నన్ను నేను అన్వేషించుకోవడానికి అది మార్గంగా కనిపించింది. దానిని నేను విజయవంతంగా పూర్తి చేశాను.. అందువల్లే ఆట గురించి విస్తృతమైన విషయాన్ని నేను చెప్పగలిగేలా చేసిందని” అశ్విన్ వ్యాఖ్యానించాడు.
ధోని గొప్ప కెప్టెన్
కెప్టెన్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు అశ్విన్ స్పందించాడు. తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు. ” మహేంద్ర సింగ్ ధోనితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతడు అందరికీ పెళ్ళాం మాదిరిగా ఉండడు. అతడు పూర్తి భిన్నమైన వ్యక్తి. ప్రాథమిక విషయాలను ధోని బాగా అధ్యయనం చేస్తాడు. ఇతర కెప్టెన్లు వాటిని పట్టించుకోరు. దానివల్ల మ్యాచ్ ఒక్కోసారి చేయి జారిపోతుంది. బంతిని బౌలర్ చేతికి ఇచ్చినప్పుడు.. నీకు నచ్చిన విధంగా ఫీలింగ్ పెట్టుకో అని చెబుతాడు. దానికి తగ్గట్టుగా బంతులు వేయమని ఆదేశిస్తాడు. కొన్నిసార్లు బౌలర్ల అంచనా తప్పినప్పటికీ ధోని పెద్దగా స్పందించడు. ఒకవేళ నా బౌలింగ్లో కొత్త బ్యాటర్ దీటుగా బ్యాటింగ్ చేస్తే.. ధోని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అలా పరుగులు వస్తే ఏం జరుగుతుందో చెప్తూ.. బౌలింగ్ నుంచి పక్కన పెడతాడు. అది క్రికెట్లో ప్రైమరీ ప్రిన్సిపుల్. చాలా సంవత్సరాలుగా ఈ విషయాన్ని క్రికెటర్లు మిస్ అవుతున్నారు.. ఆటలో మార్పునకు గురికాని అంశాలు.. అసలు మార్చలేని అంశాలు చాలా ఉంటాయి. అయితే ధోని వాటి విషయంలో పెద్దగా రెస్పాండ్ కాడు. తుషా దేశ్ పాండే ను గత ఏడాది ఐపీఎల్లో ధోని తీసుకొచ్చాడు. అతడికి నైపుణ్యం నేర్పించి రాటు తేలే విధంగా చేశాడని” అశ్విన్ పేర్కొన్నాడు. కాగా, ధోని నాయకత్వంలో టీమిండియా 60 టెస్టులు ఆడగా.. అందులో 27 మ్యాచ్లలో విజయం సాధించింది. 18 మ్యాచ్లలో ఓటమిపాలైంది. మిగతావి డ్రా అయ్యాయి.