https://oktelugu.com/

Srivishnu : హీరో శ్రీవిష్ణు ని మోసం చేసిన బిగ్ బాస్ బ్యూటీ..కోట్ల రూపాయిల నష్టం..చెప్పాపెట్టకుండా పరార్!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయిన హీరోల్లో ఒకడు శ్రీ విష్ణు. కెరీర్ ప్రారంభంలో ఈయన ఒక్క ఛాన్స్ కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 05:04 PM IST

    Srivishnu

    Follow us on

    Srivishnu : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయిన హీరోల్లో ఒకడు శ్రీ విష్ణు. కెరీర్ ప్రారంభంలో ఈయన ఒక్క ఛాన్స్ కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. సినిమా ఇండస్ట్రీ మీద పిచ్చి తో వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, క్యారక్టర్ రోల్స్ చేస్తూ నెమ్మదిగా హీరో గా మారాడు ఈయన. హీరో గా మారిన తర్వాత కూడా వెంటనే సక్సెస్ లు రాలేదు. కానీ ఈయన చేసిన కొన్ని వెబ్ ఫిలిమ్స్ కి అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎవరీ కుర్రాడు, మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి అని శ్రీ విష్ణు గురించి ప్రతీ ఒక్కరు మాట్లాడుకున్నారు. 2016 వ సంవత్సరం లో విడుదలైన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే చిత్రం తో ఈయన మొట్టమొదటిసారి హీరో గా మారాడు. ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ, శ్రీ విష్ణు కి మంచి పేరు మాత్రం తీసుకొచ్చింది.

    ఆ తర్వాత 2019 వ సంవత్సరం లో ‘బ్రోచేవారెవరురా’ అనే చిత్రం తో మొట్టమొదటి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న శ్రీ విష్ణు కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘రాజా రాజా చోరా’, ‘సమజవరగమనా’, ‘ఓం భీం బుష్’, ‘స్వాగ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శ్రీ విష్ణు ‘ఓం భీం బుష్’ చిత్రం తాలూకు అనుభవాలను కొన్ని పంచుకున్నాడు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అయేషా ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. ఈమె ఈ చిత్రం చేస్తున్న సమయంలోనే హిందీ బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చిందట. ఆ ఆఫర్ రాగానే సినిమాని మధ్యలో వదిలేసి, చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందట.

    మళ్ళీ ఆమె 70 రోజుల తర్వాత షూటింగ్ కి తిరిగి వచ్చిందట. ఆమెతో అనేక సన్నివేశాలను అప్పటికే షూట్ చేసి, ఇప్పుడు ఈమె వెళ్ళిపోయింది కదా అని ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకొని బడ్జెట్ పెంచుకోలేక, అలా షూటింగ్ ని కొంతకాలం ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అలా ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఆమె కారణంగా ఆలస్యం అయ్యిందని చెప్పుకొచ్చాడు శ్రీ విష్ణు. అయితే ఈమె బిగ్ బాస్ సీజన్ 17 లో టాప్ 8 కంటెస్టెంట్ గా నిల్చింది. ప్రస్తుతం ఈమె గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘జాట్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక శ్రీవిష్ణు విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన రెండు సినిమాలకు సంతకం చేసాడు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.