https://oktelugu.com/

Allu Arjun : పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయిన అల్లు అర్జున్.. ఇంతకీ ఏంటి ఆ ప్రశ్నలు?

సంధ్య థియేటర్ ఘటన విషయమై నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు మరోసారి స్టేషన్ కి పిలిపించుకొని విచారించిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 04:58 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన విషయమై నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు మరోసారి స్టేషన్ కి పిలిపించుకొని విచారించిన సంగతి తెలిసిందే. సుమారుగా మూడున్నర గంటల పాటు ఈ విచారణ సాగినట్టు సమాచారం. ఈ విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ కొన్నిటికి సమాధానం చెప్పాడని, కొన్నిటికి సమాధానం చెప్పలేక మౌనం గా ఉండిపోయాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ముఖ్యంగా మొన్నటి ప్రెస్ మీట్ లో సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయానని చెప్పారు కదా, మరి రాత్రి 12 గంటల వరకు సినిమా థియేటర్ లోనే మీరు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి, దీనికి మీరేమి సమాధానం చెప్తారు అని పోలీసులు అడగగా, అల్లు అర్జున్ మౌనం వహించినట్టు తెలుస్తుంది. పోలీసులు మీకు లోపలకు వచ్చి జరిగిన ఘటన గురించి చెప్పలేదు అన్నారు కదా, మరి మిమ్మల్ని లోపల నుండి పోలీసులే తీసుకొస్తున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని సీసీటీవీ వీడియో చూపించారట.

    దీనికి కూడా అల్లు అర్జున్ నుండి సమాధానం అందలేదని తెలుస్తుంది. అలా సాగిన ఈ విచారణ తర్వాత, అల్లు అర్జున్ మరోసారి సారి సంధ్య థియేటర్ కి తీసుకెళ్లి, సీన్ రీ క్రియేట్ చేశారట. ఆ తర్వాత ఏమి జరిగింది అనే దానిపై సమాచారం లేదు కానీ, మూడు గంటల పాటు సాగిన ఈ సమీక్షలో పోలీసులకు ఆరోజు ఏమి జరిగింది అనే దానిపై మాత్రం స్పష్టత వచ్చిందని తెలుస్తుంది. అది అల్లు అర్జున్ కి పాజిటివ్ అవుతుందా, నెగటివ్ అవుతుందా అనేది తెలియదు. ఇదంతా పక్కన మళ్ళీ అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుందని అల్లు అర్జున్ కి పోలీసులు చెప్పగా, కచ్చితంగా వస్తానని, ఈ విషయం లో మీకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ పోలీసులతో అన్నాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    ఇది ఇలా ఉండగా ఆరోజు రాత్రి పోలీసులను అల్లు అర్జున్ వద్దకు చేరకుండా ఆపే ప్రయత్నం చేసిన బౌన్సర్ ఆంథోనీ ని అరెస్ట్ చేసారు. ఈ ఘటనలో మరికొంత మంది అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే అల్లు అర్జున్ ఇంటి పై పలువురు ఉస్మానియా యూనివర్సిటీ కి చెందినవారు రాళ్ళ తో దాడి చేసి, ఇంట్లోకి చొరబడి పూల కుండీలను బద్దలు కొట్టి, ఆ తర్వాత అల్లు అర్జున్ సెక్యూరిటీ పై దాడి చేసిన ఘటన ఎంతటి సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు పటిష్టమైన భద్రతా ని అందించారు. రాళ్లు విసిరే అవకాశం మళ్ళీ ఉన్నందున ఇంటి చుట్టూ తెల్లని పరాధాని భద్రతా కోసం చుట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.