Ravichandran Ashwin : ఏ బౌలర్ దరిదాపుల్లో లేరంతే.. చరిత్ర సృష్టించిన అశ్విన్‌

దిగ్గజ ప్లేయర్‌ జో రూట్‌ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఈ సిరీస్‌లో అశ్విన్‌ మరో వికెట్‌ పడగొడితే టెస్టుక్రికెట్‌లో 500 వికెట్లు సాధించిన క్లబ్‌లో చేరుతాడు.

Written By: NARESH, Updated On : February 5, 2024 7:16 pm

Ravichandran Ashwin

Follow us on

Ravichandran Ashwin : వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా భారత్‌ సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ రికార్డు గతంతో బీఎస్‌.చంద్రశేఖర్‌ పేరిట ఉండేది. అతను ఇంగ్లండ్‌పై 95 వికెట్లు తీశాడు.

45 ఏళ్ల రికార్డు బద్ధలు..
ఇప్పటి వరకు ఇంగ్లండ్‌పై భారత మాజీ లెగ్‌ స్పిన్నర్‌ భగవత్ చంద్రశేఖర్(95) వికెట్లు పడగొట్టాడు. 1964-79 కాలంలో అతడు ఈ ఫీట్‌ సాధించాడు. వైజాగ్‌ మ్యాచ్‌లో 45 ఏళ్ల చంద్రశేఖర్ ఆల్‌టైమ్‌ రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు. అశ్విన్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు సాధించిన టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌(97 వికెట్లు) చరిత్ర లిఖించాడు. తర్వాత స్థానంలో చంద్రశేఖర్‌(95), అనిల్‌ కుంబేల(92), బిషన్‌ సింగ్‌ బేడీ(85), కపిల్‌దేవ్‌(85), ఇషాంత్‌ శర్మ(67) ఉన్నారు. ప్రస్తుత భారత బౌలర్లు ఎవరూ అశ్వి¯న్‌కు దగ్గరలో లేరు.

మూడు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌..
ఇక రెండో టెస్టు రెండో ఇన్నింగ్‌లో అశ్విన్‌ మూడు వికెట్లు తీశాడు. మూడో రోజే ఒక వికెట్‌ పడగొట్టిన అశ్విన్‌ చంద్రశేఖర్‌ రికార్డును సమం చేశాడు. నాలుగో రోజు తొలి సెషన్‌లో భారత బౌలర్లు చెలరేగారు. లంచ్‌ సమయానికే ఐదు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ తన అనుభవంతో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. గత టెస్టు హీరో ఓలీ పోప్, దిగ్గజ ప్లేయర్‌ జో రూట్‌ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. ఈ సిరీస్‌లో అశ్విన్‌ మరో వికెట్‌ పడగొడితే టెస్టుక్రికెట్‌లో 500 వికెట్లు సాధించిన క్లబ్‌లో చేరుతాడు.