Grammy Awards 2024 : సంగీత రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన 2024 గ్రామీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో 66వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రపంచ దేశాలకు చెందిన పలువురు సంగీత కళాకారులు పాల్గొన్నారు.
మ్యూజిక్ అవార్డ్ షోకు ట్రెవర్ నోహ్ హోస్ట్ గా వ్యవహరించారు. అంతేకాదు పలువురు ప్రముఖ ఆర్టిస్టులు వేదికపై లైవ్ ఫర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులు మైమరిపోయారని చెప్పుకోవచ్చు. కాగా ర్యాప్ ఆల్బమ్, ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన, ఉత్తమ రాక్ ప్రదర్శన, ర్యాప్ సాంగ్, ఉత్తమ ఫోక్ ఆల్బమ్ ఇలా పలు కేటగిరీల్లో ప్రముఖులు విజేతలుగా నిలిచారు.
అంతేకాదు ఈ వేడుకల్లో భారత్ కు చెందిన మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ సత్తా చాటారు. దిస్ మూమెంట్ అనే ఆల్బమ్ కు గ్రామీలో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కింది. అయితే ఈ సాంగ్ ను ఎనిమిది మంది శక్తి అనే బ్యాండ్ పేరుతో కంపోజ్ చేశారు. వీరిలో సింగర్ గా శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ (తబ్లా), జాన్ మెక్ లాగ్లిన్ (గిటార్), గణేశ్ రాజాగోపాలన్ (వయోలిన్) మరియు వి సెల్వ గణేశ్(పెర్కషనిస్ట్ ) గా ఉన్నారు. దాంతో పాటుగా జాకీర్ హుస్సేన్ మరో గ్రామీ అవార్డును కైవసం చేసుకున్నారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫారెన్స్ కేటగిరిలో పాస్తో ఆల్బమ్ కి రాకేశ్ చౌరాసియా, ఎడ్గర్ మేయర్,బెలా ఫ్లెక్ తో కలిసి జాకీర్ హుస్సేన్ ఈ అవార్డును అందుకున్నారు.
అలాగే ఉత్తమ్ ర్యాప్ ఆల్బమ్ గా మైఖేల్ -‘కిల్లర్ మైక్’ ను అందుకున్నారు. ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన – టైలా (వాటర్), ఉత్తమ బ్లూగ్రాస్ ఆల్బమ్ – మొల్లీ టర్టల్ & గోల్డెన్ హైవే – సిటీ ఆఫ్ గోల్డ్, ఉత్తమ కంట్రీ సోలో ప్రదర్శన క్రిస్ స్టేప్లెటన్ – (వైట్ హార్స్), ఉత్తమ కంట్రీ సాంగ్ క్రిస్ స్టేప్లెటన్ – (వైట్ హార్స్), ఉత్తమ కామెడీ ఆల్బమ్ – డేవ్ చాపెల్ – (వాట్స్ ఇన్ ఎ నేమ్), ఉత్తమ కంటెంపరరీ ఇన్‌స్ట్రుమెంటల్ ఆల్బమ్ – బెలా ఫెక్, జాకిర్ హుస్సేన్, ఎడ్గార్ మెయర్, ఫీచరింగ్ రాకేష్ చౌరాసియా – ఆస్ వీ స్పీక్, ఉత్తమ రాక్ ఆల్బమ్ – పారామోర్ – దిస్ ఇజ్ వై, ఉత్తమ మ్యూజికల్ థియేటర్ ఆల్బమ్ – సమ్ లైక్ ఇట్ హాట్, ఉత్తమ రాక్ సాంగ్ బాయ్‌జెనియస్ – నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ , ఉత్తమ రాక్ ప్రదర్శన బాయ్‌జెనియస్ – నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ అవార్డులను కైవసం చేసుకున్నారు.