Karate Kalyani and Hema : ప్రముఖ నటి కరాటే కళ్యాణి(Karate Kalyani) పై నటి హేమ(Actress Hema) గతంలో తనపై చేసిన ఆరోపణలను తప్పుబడుతూ లీగల్ నోటీసులను నేడు పంపించింది. మీడియా ముందుకొచ్చి తన పరువు మర్యాదలకు భంగం కలిగేలా అసత్య ప్రచారాలు చేసినందుకు ఈ నోటీసులు పంపినట్టు తెలుస్తుంది. గత ఏడాది బెంగళూరు లోని ఒక పార్టీ లో హేమ అసాంఘిక కార్యకలాపాలు చేసిందని ప్రచారం చేయడంతో మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్(MAA) ఆమెను సస్పెండ్ చేసింది. అయితే ఆ తర్వాత హేమ పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆమెకు వైద్య పరీక్షకులు చేయగా, మెడికల్ రిపోర్ట్స్ లో నెగటివ్ అని తేలింది. ఆ తర్వాత MAA హేమ పై వేసిన సస్పెన్షన్ వేటుని ఎత్తిపారేసింది నెగటివ్ అని తేలిన తర్వాత నాపై దుష్ప్రచారం చేసిన వాళ్ళని ఎవరినీ కూడా విడిచిపెట్టను అని సవాలు చేసిన హేమ, అందులో భాగంగానే ముందుగా కరాటే కళ్యాణి పై లీగల్ వార్ ప్రకటించింది.
Also Read : బెంగుళూరు రేవ్ పార్టీ కేసు… పవన్ కళ్యాణ్ ని కలుస్తా అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసిన హేమ!
కరాటే కళ్యాణి, హేమ మధ్య ఇలా గొడవలు జరగడం, ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవడం వంటివి కొత్తేమి కాదు. వీళ్లిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హేమ అయితే ఎంతో కాలం నుండి MAA లో కీలక సభ్యురాలిగా కొనసాగుతూ ఉంది. ఇక్కడి నుండే వీళ్లిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కరాటే కళ్యాణి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ హేమ మాత్రం ఒకప్పుడు మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్ట్. దాదాపుగా అందరి హీరోల సినిమాల్లో ఈమె ముఖ్యమైన పాత్రలు పోషించింది. ఎక్కువగా అక్క, వదిన, అమ్మ క్యారెక్టర్స్ ద్వారా ఈమె బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈమధ్య కాలంలో ఏమైందో ఏమో తెలియదు కానీ సినిమాలు బాగా తగ్గించేసింది.
ఈమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘క్రేజీ అంకూల్స్’. ఈ ఏడాది విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రంలో కూడా కీలక పాత్ర చేసింది కానీ, ఆ సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించేశారట. 1989 వ సంవత్సరం లో చిన్నారి స్నేహం అనే సినిమా ద్వారా మొదలైన హేమ, తన కెరీర్ లో దాదాపుగా 200 కి పైగా సినిమాల్లో నటించింది. అదే విధంగా స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఏడాది టెలికాస్ట్ అయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. కేవలం 9 రోజులకే ఈమె ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అదే విధంగా ఈమె 2014 వ సంవత్సరం లో ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ లో చేరి రాజకీయ అరంగేట్రం కూడా చేసింది. మండపేట అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయింది.
Also Read : నాకు వాళ్ళ నుండి ప్రాణహాని ఉంది, హత్యాయత్నం కూడా జరిగింది… కరాటే కళ్యాణి సంచలనం!