Ravichandran Ashwin aggressive behavior : సీనియర్ ఆటగాడిగా.. అనుభవం ఉన్న ప్లేయర్ గా అతడు టీమిండియా కు అపారమైన సేవలు అందించాడు. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్లో తిరుగులేని స్థాయిలో వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఆ స్థాయిలో వికెట్ల ప్రదర్శన చేసి అదరగొట్టాడు. కొన్ని సందర్భాలలో టెస్ట్ మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఇటీవల కంగారు జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అంతర్జాతీయ క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలికాడు. ఇక ప్రస్తుతం అశ్విన్ ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు. స్థిర చిత్తానికి.. అపారమైన ఓపికకు బ్రాండ్ అంబాసిడర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ ఒక్కసారిగా కట్టు తప్పాడు. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం కోయంబత్తూర్ వేదికగా తమిళనాడు ప్రీమియర్ లీగ్ సాగుతోంది. అయితే మహిళా అంపైర్ వెంకటేశన్ కృతిక ఇచ్చిన నిర్ణయంపై అశ్విన్ అసంతృప్తికి గురయ్యాడు. అంతేకాదు దురుసుగా ప్రవర్తించాడు.. దీంతో ఒక్కసారిగా అశ్విన్ విమర్శలకు గురవుతున్నాడు. సోషల్ మీడియాలో అతడి పై విపరీతంగా ట్రోల్స్ నమోదు అవుతున్నాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం దిండిగల్ డ్రాగన్స్, తిరుపూర్ తమిళియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.. డ్రాగన్స్ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్లో అతడు 18 పరుగులు, శివం సింగ్ 30 పరుగులు చేసి ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. అయితే తిరుప్పూర్ జట్టు బౌలర్ సాయి కిషోర్ వేసిన ఐదవ ఐదో బంతిని అశ్విన్ స్వీప్ ఆడాడు. ఆ బంతి కాస్త ప్యాడ్లను తగిలింది. పరుగు కోసం అశ్విన్ ప్రయత్నించగా.. బౌలర్ అప్పీల్ చేశాడు. నీతో ఎంపైర్ ఔట్ ఇచ్చింది. రిప్లై లో లెగ్ స్టంప్ దిశగా బంతి పిచ్ అయినట్టు కనిపించింది.. అయితే అప్పటికే అశ్విన్, శివం సింగ్ తొలి ఓవర్ లోనే లెగ్ సైడ్ వెళ్లిన వైడ్ల కోసం డీఆర్ఎస్ ను ఉపయోగించుకున్నారు. ఇంత వారి రెండు సమీక్షలు ముగిసిపోయాయి. దీంతో అంపైర్ నిర్ణయం అశ్విన్ కు ఇబ్బంది కలిగించింది.
Ravichandran Ashwin got angry on Umpire, throws his gloves towards the spectators in Domestic League called TNPL
~ What's your take on this pic.twitter.com/5Dbk9AiSle
— Richard Kettleborough (@RichKettle07) June 9, 2025
అంపైర్ అవుట్ ఇవ్వడంతో.. అశ్విన్ పట్టరాని కోపంతో డగ్ అవుట్ కు వెళ్లిపోయాడు.. అంతేకాదు అంపైర్ నిర్ణయాన్ని అతడు వ్యతిరేకించాడు. ఆమెతో కాస్త వారించాడు. అంతేకాదు డగ్ అవుట్ కు వెళుతూ బ్యాట్ తో ప్యాడ్లను కొట్టుకున్నాడు. బౌండరీ లైన్ దగ్గరికి వెళ్లగానే తన చేతికి ఉన్న గ్లవ్స్ తీసేసి గ్యాలరీలోకి విసిరి కొట్టాడు. వాస్తవానికి అశ్విన్ నిశ్శబ్దంగా ఉంటాడు. ఎటువంటి దురుసు ప్రవర్తన ప్రదర్శించడు. అయితే ఒక్కసారిగా అతడు అలా ప్రవర్తించడంతో మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అది దీనిపై ఇంతవరకు తమిళ నాడు ప్రీమియర్ లీగ్ నిర్వాహక కమిటీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే మ్యాచ్ రిఫరీ దీనిపై ఎటువంటి నివేదిక ఇస్తుందో చూడాల్సి ఉంది.. అన్నట్టు ఈ మ్యాచ్లో డ్రాగన్స్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది..” తన యూట్యూబ్ చానల్లో అశ్విన్ ఎన్నో నీతులు చెబుతాడు. ఆటగాళ్లు ఎలా ఉండాలో ఉపన్యాసాలు ఇస్తాడు. తను మాత్రం పాటించడు. కోపం వస్తే ఇలా అడ్డగోలుగా ప్రవర్తిస్తాడు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడు. ఇటువంటి వ్యక్తి నీతులు చెప్పడం అంటే నేతిబీర సామెత గుర్తుకు వస్తోందని” నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.. రవిచంద్రన్ అశ్విన్ తప్పు పడుతున్నారు.
#RavichandranAshwin clearly wasn’t pleased with the umpire’s call.
Was the decision spot on or a big miss?
What’s your take? #TNPLOnJioStar Chepauk Super Gillies v Nellai Royal Kings | LIVE NOW on Star Sports 2 and Star & JioHotstar pic.twitter.com/fyNBIGcNf6
— Star Sports (@StarSportsIndia) June 9, 2025