https://oktelugu.com/

Ranji Trophy 2024-25: బంతి వేయడమే ఆలస్యం.. బ్యాటర్లు పెవిలియన్ కు.. ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు.. రంజి క్రికెట్లో 39 ఏళ్ల రికార్డ్ పునరావృతం చేసిన యువ బౌలర్

రంజీ క్రికెట్లో సంచలనం చోటుచేసుకుంది. ఒక ఇన్నింగ్స్ లో ఓ యువ బౌలర్ పది వికెట్లు పడగొట్టడం ప్రకంపనలకు దారితీసింది. అంతేకాదు అతగాడి బౌలింగ్ దూకుడుకు రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. కొత్త ఘనతలు పుట్టుకొచ్చాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 15, 2024 / 05:35 PM IST

    Ranji Trophy 2024-25

    Follow us on

    Ranji Trophy 2024-25: హర్యానా రంజీ జట్టు బౌలర్ అన్షుల్ కాంబోజ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టి.. అది కూడా ఒకే ఇన్నింగ్స్ లో నేల కూల్చి సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు. రంజీ క్రికెట్ చరిత్రలో ఇలా పదవి వికెట్లు సాధించిన మూడవ బౌలర్ గా అన్షుల్ నిలిచాడు. 23 సంవత్సరాల
    అన్షుల్ హర్యానా రాష్ట్రంలోని రోహ్ తక్ ప్రాంతంలోని చౌదరి బన్సీలాల్ మైదానంలో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అతడి ఏకంగా 30.1 ఓవర్లు వేశాడు. 49 పరుగులు ఇచ్చాడు. 10 వికెట్లు పడగొట్టాడు. గత ఐపిఎల్ లో ముంబై జట్టు తరఫున అన్షుల్ ఆడాడు.. రంజి క్రికెట్లో అన్షుల్ కంటే ముందు ఇద్దరు బౌలర్లు ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు సాధించిన వారిలో ఉన్నారు. 1956లో అస్సాం జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రమగ్షు చటర్జీ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో అతడు పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్ ధాటికి అస్సాం బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 1985 లో విదర్భతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్ ప్రదీప్ సుందరం 10 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అన్షుల్ తాజా సంచలనంగా నిలిచాడు. అనిల్ కుంబ్లే, సుభాష్ గుప్తే, దేభాశిష్ మహంతి కూడా ఈ జాబితాలో ఉన్నారు.

    అన్షుల్ ధాటికి..

    అన్షుల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేరళ 291 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అయితే 10 వికెట్లు తీయడం ద్వారా అన్షుల్ మరో రికార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు. కేవలం 19 దేశవాళి మ్యాచ్లలోనే అతడు 50 వికెట్ల క్లబ్ లోకి చేరుకున్నాడు.. గతంలో విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా జట్టు తరఫున అన్షుల్ ఆడాడు. ఆ ట్రోఫీలో హర్యానా జట్టు విజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అతడు ఏకంగా పది మ్యాచ్లు ఆడి.. 17 వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ 10 వికెట్లు పడగొట్టడం ద్వారా 39 సంవత్సరాల రికార్డును మరోసారి పునరావృతం చేశాడు. 1956లో అస్సాం జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగాల్ బౌలర్ ప్రమగ్షు చటర్జీ 20 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. 1985లో రాజస్థాన్ బౌలర్ ప్రదీప్ సుందరం విదర్భ జట్టుపై 78 పరుగులు ఇచ్చి పదవి వికెట్లు సొంతం చేసుకున్నాడు. 2024లో హర్యానా జట్టుకు చెందిన అన్షుల్ కేరళ రాష్ట్రంపై 49 పరుగులు ఇచ్చి పదవీ వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ అద్భుతంగా బోధించడంతో కేరళ 291 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. 39 సంవత్సరాల తర్వాత పది వికెట్ల ఘనతను రిపీట్ చేయడం పట్ల అన్షుల్ పై అభినందనల జల్లు కురుస్తోంది.అన్షుల్ వికెట్లు తీసిన సందర్భాలను పురస్కరించుకొని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఫోటోలను పోస్ట్ చేసింది. అన్షుల్ 10 వికెట్లు తీయడంతో నెటిజన్లు అతనిపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు. ” ఇలాగే బౌలింగ్ చేస్తూ ఉండు. ఏదో ఒక రోజున టీమిండియా బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తావు. కచ్చితంగా టీమిండియా విజయాలలో ముఖ్య పాత్ర పోషిస్తావు. ఉడుకు రక్తం ఉంది కాబట్టి.. ఇదే దూకుడు కొనసాగించని” నెటిజన్లు అన్షుల్ కు సూచిస్తున్నారు.