https://oktelugu.com/

Guntur: బైక్ వీల్ లో చీర చిక్కింది.. అదే ఆమె చివరి రోజైంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..

"మనిషి జీవితం నీటి బుడగతో సమానం. ఎప్పుడు ఏ సమయంలో పేలుతుందో ఎవరికీ తెలియదు." వెనుకటి కాలంలో ఓ రచయిత రాసిన మాటలవి. ఆ మాటలు ఈ మహిళ జీవితంలో నిజమయ్యాయి.. అప్పటిదాకా బాగున్న ఆమె అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. అయితే దాని వెనుక జరిగిన సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 15, 2024 / 05:39 PM IST

    Guntur

    Follow us on

    Guntur: ఆమె పేరు దాసరి సుస్మిత. కారుణ్య నియామకం కింద ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు. కళాశాల చదువులు చదువుతున్న తన కుమారుడిని చూసి రావడానికి.. మరో కుమారుడి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. తన కుమారుడిని చూసి, అతని బాగోగులు తెలుసుకొని.. డ్యూటీ కి వెళ్లాలనే ఆత్రుతలో తన కుమారుడి ద్వి చక్రవాహనంపై బయలుదేరింది. కానీ అదే ఆమె ప్రాణాలు తీస్తుందని భావించలేదు. ఆఫీసుకు లేట్ అవుతుందనే భయంతో.. బస్సు ఎక్కాలని భావించి.. తన కుమారుడి బైక్ పై కూర్చుంది. బస్సును ఎలాగైనా క్యాచ్ చేయాలని అనుకుంది. కానీ అదే ఆమె ప్రాణాలు తీసింది. బైక్ పై వెళ్తుండగా..ఆ వీల్ లో ఆ మహిళ చీర కొంగు చిక్కుకు పోయింది. అంతే ప్రమాదానికి గురై.. నిమిషాల వ్యవధిలో విగత జీవిగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

    కుమారుడిని చూసి

    పల్నాడు ప్రాంతానికి చెందిన దాసరి శ్రీకాంత్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించేవారు. అయితే అతను 2009లో గుండెపోటుకు గురై మృతి చెందాడు. కారుణ్య నియామకం కింద ఆయన భార్య సుస్మితకు ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పల్నాడు జిల్లా మాచర్ల లోని కాసు బ్రహ్మానందరెడ్డి కాలేజీలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తోంది. అదే ప్రాంతంలో ఆమె నివాసం ఉంటున్నది.. సుస్మితకు ఇద్దరు కుమారులు. అందులో చిన్న కుమారుడు ధనుష్ వాత్సవ్ ను చూసి రావడానికి గుంటూరు జిల్లా నల్లపాడుకు వెళ్ళింది. అయితే గురువారం తన విధులకు హాజరు కావాలని ఆమె బయలుదేరింది. మాచర్ల వెళ్లడానికి బస్సు ఎక్కేందుకు ఆమె బయలుదేరింది. పేరేచర్ల చౌరస్తాలో దిగబెడతానని ఆమె కుమారుడు చెప్పడంతో అతని బైక్ ఎక్కింది. అలా ఆమె ప్రయాణిస్తున్న క్రమంలో చీర కొంగు బైక్ వెనుక వీల్ లో చిక్కుకొంది. దీంతో సుస్మిత కింద పడింది. ఆమె తలకు బలమైన దెబ్బ తగిలింది. తీవ్రంగా రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే కను మూసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మేడికొండూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు వహించాలని.. చీర కొంగులు, చున్నీలను చేతులతో పట్టుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకొని ప్రాణాలు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు.