https://oktelugu.com/

Vijayawada: ఆహారంలో జెర్రీ.. ఏపీలో ఫేమస్ హోటల్ సీజ్!

ఇటీవల హోటళ్లలో ఆహారం కల్తీ అవుతోంది. కలుషితంగా మారుతోంది. ప్రముఖ హోటళ్లలో సైతం ఇదే పరిస్థితి ఉంది. ఏపీలో ఎంతో ఫేమస్ అయిన ఓ హోటల్ ఇదే కారణంతో తాజాగా సీజ్ అయ్యింది.

Written By:
  • Bhaskar
  • , Updated On : November 15, 2024 / 05:31 PM IST

    Vijayawada

    Follow us on

    Vijayawada: సుబ్బయ్య హోటల్.. ఏపీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ హోటల్ ఇది. కాకినాడలో సుపరిచితమైన ఈ హోటల్ బ్రాంచ్ లు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ఒక్క కాకినాడలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక నగరాల్లో వీటి బ్రాంచులు ఏర్పాటు అయ్యాయి. ఈ హోటళ్లలో ఫుడ్ రుచికి మారుపేరు. మంచి భోజనం అందించే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. అయితే ఇంతటి బ్రాండెడ్ మార్కెట్ కలిగిన హోటళ్లను సీజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ విజయవాడలో జరిగింది ఈ ఘటన. కాకినాడ సుబ్బయ్య హోటల్ బ్రాంచ్ లో ఒక కస్టమర్ భోజనం చేయడానికి ఆర్డర్ చేశారు. అక్కడ సిబ్బంది ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. అయితే ఆ భోజనంలో కాళ్ళ జెర్రీ ఉంది. దీంతో సదరు వ్యక్తి సిబ్బందిని పిలిచి అడిగాడు. అసహనం వ్యక్తం చేశాడు. అయితే అదే సమయంలో హోటల్లో కేంద్ర మానవ హక్కుల కమిషన్ ఇంచార్జ్ చైర్మన్ విజయభారతి భోజనం చేయడానికి వచ్చారు. జరిగిన విషయం తెలుసుకొని సుబ్బయ్య గారి హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    * అధికారుల ఉరుకులు, పరుగులు
    సాక్షాత్తు మానవ హక్కుల కమిషన్ ఇంచార్జ్ చైర్మన్ ఆదేశాలు ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ తో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సుబ్బయ్య గారి హోటల్ ను సీజ్ చేశారు.ఫుడ్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు.

    * ఫిర్యాదుల వెల్లువ
    అయితే ఇటీవల ప్రముఖ హోటళ్లపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆహారం కల్తీ జరగడంతో పాటు నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. చాలాచోట్ల ఆహారం కల్తీ కూడా జరుగుతోంది. అయితే ఆహార కల్తీ నియంత్రణ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉంది. కానీ సిబ్బంది కొరత తో పాటు రకరకాల కారణాలు చూపుతూ తనిఖీలు సక్రమంగా జరగడం లేదు. దీంతో హోటళ్లలో వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి.