Rajat Patidar: ఎవరీ రజత్ పాటిదార్.. టీమిండియాలోకి ఎలా వచ్చారు? అతడి ట్రాక్ రికార్డ్ ఏంటంటే..?

సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన పాటిదర్ కోహ్లీని రీప్లేస్ చేసే విధంగా ఆడతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక పాటిదార్ మీద బిసిసిఐ ఎందుకు ఇంత నమ్మకాన్ని పెట్టుకుందో ఎవరికి అర్థం కావడం లేదు.

Written By: Gopi, Updated On : February 2, 2024 1:48 pm
Follow us on

Rajat Patidar: ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇండియన్ టీం లోకి రజత్ పాటిదర్ అనే యంగ్ ప్లేయర్ ని తీసుకున్నారు. ఇక మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకి కోహ్లీ దూరమైన నేపథ్యంలో కోహ్లీ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ బిసిసిఐ పాటిదార్ ని సెలెక్ట్ చేసింది. ఇప్పటికే చీలిమండ గాయంతో దాదాపు 8 నెలల పాటు క్రికెట్ కి దూరంగా ఉంటూ వస్తున్న పాటిదర్ రీసెంట్ గా భారత్ ఏ తరపున ఇంగ్లాండ్ తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

అందులో 151 పరుగులు చేయడంతో బీసీసీఐ అతని మీద ఎక్కువ ఫోకస్ చేసింది. అందుకే ఆయన కంటే సీనియర్ ప్లేయర్లు అయిన చటేశ్వర్ పూజార, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్లను సైతం పక్కనపెట్టి పాటిదర్ ని టీమ్ లోకి తీసుకుంది. ఇక సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన పాటిదర్ కోహ్లీని రీప్లేస్ చేసే విధంగా ఆడతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక పాటిదార్ మీద బిసిసిఐ ఎందుకు ఇంత నమ్మకాన్ని పెట్టుకుందో ఎవరికి అర్థం కావడం లేదు. పాటిదార్ ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్. అలాగే క్రీజ్ లో ఎక్కువ సమయం ఉండే విధంగా తనని తాను మౌల్డ్ చేసుకుంటూ పరుగులు రాబట్టే సత్తా ఉన్న ప్లేయర్ కావడం వల్లే బిసిసిఐ తనకి తుది జట్టులోకి అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది.

మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన ఇండియన్ టీమ్ రెండో టెస్ట్ మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాటిధర్ టీమ్ కి తన వంతు సహాయాన్ని అందిస్తాడా లేదా ఇంగ్లాండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఐపీఎల్ లో బెంగళూరు టీమ్ తరఫున ఆడుతున్న ఈ కుర్ర ప్లేయర్ అక్కడ కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తూ ఆ టీమ్ లో కీలక ప్లేయర్ గా మారాడు. మరి మొదటి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న పాటిదార్ ఇండియన్ టీమ్ ని విజయ తీరాలకు చేరుస్తాడా, బిసిసిఐ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది కూడా తెలియాలంటే ఈ మ్యాచ్ అయిపోయెంత వరకు వెయిట్ చేయాల్సిందే…