https://oktelugu.com/

Poonam Pandey: బ్రేకింగ్: ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే హఠాన్మరణం! కారణం ఇదే!

పూనమ్ పాండే అత్యంత కాంట్రవర్సియల్ మోడల్. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా కనిపిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పట్లో ఇది సంచలనమైంది. బీసీసీఐ ఆమె స్టేట్మెంట్ పై అసహనం వ్యక్తం చేసింది.

Written By: , Updated On : February 2, 2024 / 01:27 PM IST
Poonam Pandey dies of cervical cancer
Follow us on

Poonam Pandey: చిత్ర పరిశ్రమలో ఊహించని విషాదం నెలకొంది. ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే హఠాన్మరణం పొందారు. ఆమె వయసు కేవలం 32 ఏళ్ళు. పూనమ్ మృతికి కారణం క్యాన్సర్ అని తెలుస్తుంది. గర్భాశయ క్యాన్సర్ తో పూనమ్ పాండే మరణించినట్లు సన్నిహితులు పూనమ్ పాండే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. ఈ ఉదయం మాకు చాలా కఠినమైనది. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించారు. ఈ సమాచారం పంచుకునేందుకు అత్యంత బాధగా ఉంది. పూనమ్ దయా హృదయం కలిగిన అమ్మాయి. ప్రతి జీవిని ఆమె ప్రేమించారు, అని రాసుకొచ్చారు.

పూనమ్ పాండే అత్యంత కాంట్రవర్సియల్ మోడల్. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా కనిపిస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పట్లో ఇది సంచలనమైంది. బీసీసీఐ ఆమె స్టేట్మెంట్ పై అసహనం వ్యక్తం చేసింది. అలాగే బాత్రూం లో డాన్స్ చేస్తున్న వీడియో యూట్యూబ్ లో షేర్ చేయగా, దాన్ని గూగుల్ బ్యాన్ చేసింది.

పూనమ్ పాండే 2020 సెప్టెంబర్ నెలలో సామ్ బాంబే ని వివాహం చేసుకుంది. పెళ్ళైన నెలరోజుల్లోపే అతని మీద కేసు పెట్టింది. భర్త సామ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ప్రాణహాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా గోవాలో సామ్ అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ కాంప్రమైజ్ అయిన పూనమ్ అతనితో కలిసి జీవించింది.

పూనమ్ పాండే ఒక యాప్ ఓపెన్ చేసింది. అందులో కంటెంట్ వల్గర్ గా ఉండగా గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ ని తొలగించారు. పూనమ్ తెలుగులో కూడా నటించడం విశేషం. 2015లో విడుదలైన మాలిని అండ్ కో చిత్రంలో పూనమ్ పాండే హీరోయిన్ గా చేసింది. నషా, లవ్ ఈజ్ పాయిజన్, ది జర్నీ ఆఫ్ కర్మ చిత్రాల్లో పూనమ్ బోల్డ్ రోల్స్ చేసింది. పూనమ్ మృతిపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.