Homeక్రీడలుక్రికెట్‌Rajat Patidar Bengaluru performance: కోహ్లీ వల్ల కాలేదు.. గేల్ కు సాధ్యం కాలేదు.. ఇతడే...

Rajat Patidar Bengaluru performance: కోహ్లీ వల్ల కాలేదు.. గేల్ కు సాధ్యం కాలేదు.. ఇతడే బెంగళూరు రణబలి

Rajat Patidar Bengaluru performance: విరాట్ కోహ్లీ నాయకుడుగా ఉన్నప్పుడు బెంగళూరు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేదు. గేల్ వీరవిహారం చేసినప్పుడు కూడా బెంగళూరు విజేతగా నిలవలేదు. వరుసగా అన్నేసీ సీజన్లు పూర్తయినప్పటికీ.. అనేక సంందర్బాలలో ఫైనల్ దాకా వచ్చినప్పటికీ ట్రోఫీని అందుకోలేకపోయింది. కానీ, గత సీజన్లో బెంగళూరు విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం అదరగొట్టింది. ఫైనల్ లో పంజాబ్ జట్టును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.

బెంగళూరు విజేతగా నిలవడంతో రజత్ పాటిదార్ కీలక పాత్ర పోషించాడు. నాయకుడిగా, ఆటగాడిగా ద్విముఖ పాత్ర పోషించి సత్తా చూపించాడు. కీలకమైన ఇన్నింగ్స్ లు మాత్రమే కాదు, కీలకమైన పరుగులు కూడా చేసి అదరగొట్టాడు. గత సీజన్ లోనే కాదు, ఈ సీజన్ లో కూడా రజత్ పాటిదార్ దుమ్మురేపుతున్నాడు. వీరోచితమైన బ్యాటింగ్ తో వారెవ్వా అనిపిస్తున్నాడు.

తాజా సీజన్ లో కూడా బెంగళూరును అన్ని రంగాలలో ముందడుగు వేయించాడు రజత్ పాటిదార్. గుజరాత్ జట్టుతో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో దుమ్ము రేపాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 9 సిక్సర్లతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు రజత్. ఒక టీ20 టోర్నీ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ గా రజత్ పాటిదార్ నిలిచాడు. ఈ సీజన్ లో మొత్తం 41 సిక్సర్లు కొట్టాడు రజత్ పాటిదార్.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24 లో 40 సిక్సర్లు కొట్టాడు. ఆ రికార్డును రజత్ పాటిదార్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ లో శ్రేయస్ అయ్యర్ ఏకంగా 39 సిక్సర్లు కొట్టి సంచలనం నెలకొల్పాడు. వారందరూ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో రజత్ పాటిదార్ అంతకుమించిన స్థాయిలో ఆడాడు. ఏకంగా 41 సిక్సర్లు కొట్టాడు.

రజత్ పాటిదార్ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, ఇంకా ఇతర ముఖ్యమైన ప్లేయర్లు అంతగా గొప్ప ఇన్నింగ్స్ ఆడలేకపోయినప్పటికీ రజత్ పాటిదార్ మాత్రం ఓ రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. అతడు సెంచరీకి దగ్గరలో ఔట్ అయినప్పటికీ బెంగళూరుకు కావాల్సినంత లాభం చేకూరింది. బ్యాటింగ్ లో రజత్ పాటిదార్ అదరగొడితే.. బౌలింగ్ లో డఫీ, భువనేశ్వర్ సత్తా చూపించారు. ఫలితంగా గుజరాత్ ఓటమి పాలయింది. బెంగళూరు వరుసగా రెండో సీజన్ లో ఫైనల్ వెళ్లడంతో రజత్ పాటిదార్ ను ఆ జట్టు అభిమానులు తమ పాలిట రణబలి అని వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version