Homeక్రీడలుక్రికెట్‌Rajasthan Vs Mumbai: పోరగాళ్లు కాదు.. పోటుగాళ్లు..గౌహతీలో ముంబైని పోయించారు

Rajasthan Vs Mumbai: పోరగాళ్లు కాదు.. పోటుగాళ్లు..గౌహతీలో ముంబైని పోయించారు

Rajasthan Vs Mumbai: బుమ్రా, దీపక్ చాహర్, బౌల్డ్ వీళ్లేం మాములు బౌలర్లు కాదు. వీళ్ల బౌలింగ్ ను ఊచకోత కోశారు వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్. సూర్యవంశీ(39: 14 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్లు), జైస్వాల్(77: 32 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) దుమ్ము రేపారు. వీరిద్దరూ 3.2 ఓవర్లలోనే 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి వికెట్ కు కేవలం 30 బంతుల్లోనే 80 పరుగులు చేశారు.

Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు

వర్షం కురిసి ఆగిపోయిన తర్వాత మ్యాచ్ నిర్వహణకు అంపైర్లు నిర్ణయించారు. టాస్ గెలిచిన హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ, రాజస్థాన్ బ్యాటర్లు దుమ్ము రేపారు. ముఖ్యంగా 15సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ, యశస్వి జైస్వాల్ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశారు. మైదానంల పరుగుల వరద పారించారు. బౌలర్ ఎవరనేది చూడలేదు. ఎంతటి కఠినమైన బంతులు ఎదురైనా వదిలిపెట్టలేదు. బౌలర్ బంతి వేయడమే ఆలస్యం బౌండరీ మీటర్ లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు.

11 ఓవర్లకు మ్యాచ్ కుదించడంతో రాజస్థాన్ బ్యాటర్లు విధ్వంసమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. ఎదురుదాడికి దిగి పరుగుల వరద పారించారు. సిక్సర్లవర్షం కురిపించారు. బౌలర్ల మీద కనికరం లేకుండా బ్యాటింగ్ చేశారు. పిచ్ మీద ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ పరుగులు తీశారు. వేగంగా ఆడుతూ ముంబై బౌలర్ల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు.

చాహర్ ఓవర్ లో 22, బుమ్రా ఓవర్ లో 14, బౌల్డ్ ఓవర్ లో 22, శార్దూల్ ఠాకూర్ ఓవర్ లో 18 పరుగులు చేసి సంచలనం రేకెత్తించారు సూర్యవంశీ, జైస్వాల్. ఈక్రమంలో అనేక రికార్డులను సూర్యవంశీ, జైస్వాల్ బద్దలు కొట్టారు. దీపక్ చాహర్ బౌలింగ్ లో తొలి ఓవర్ లో 22 పరుగులు చేయడం ద్వారా రాజస్థాన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2023లోకోల్ కతాపై నితీష్ రాణా బౌలింగ్ లో 26, 2009లో డర్బన్ వేదికగా కోల్ కతాపై బ్రాడ్ హడ్జ్ బౌలింగ్ లో 22, 2025లో జైపూర్ వేదికగా పంజాబ్ పై అర్ష్ దీప్ బౌలింగ్ లో 22 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా జైస్వాల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్ జట్టు తరుఫున అతడు 69 ఇన్నింగ్స్ లలో 19 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో బట్లర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. బట్లర్ 82 ఇన్నింగ్స్ లలో 25, సంజు శాంసన్ 144 ఇన్నింగ్స్ లలో 25, రహానే 93 ఇన్నింగ్స్ లలో 19, షేన్ వాట్సన్ 76 ఇన్నింగ్స్ లలో 16 హాఫ్ సెంచరీలు చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version