Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi Vs Bumrah: ఓరేయ్ బుడ్డోడా.. బుమ్రా బౌలింగ్ రెండు సిక్సర్లా.. నీకు...

Vaibhav Suryavanshi Vs Bumrah: ఓరేయ్ బుడ్డోడా.. బుమ్రా బౌలింగ్ రెండు సిక్సర్లా.. నీకు ఎవరూ బౌలింగ్ చేయలేరిక

Vaibhav Suryavanshi Vs Bumrah: బుమ్రా బౌలింగ్ లో తోపు బ్యాటర్లు కూడా బ్యాటింగ్ చేయడానికి భయపడతారు. అతడు వేసే బంతులు వేగంగా దూసుకు వస్తాయి. ఫుల్లర్ లెంగ్త్, యార్కర్, స్లోయర్ వన్ లు బ్యాటర్లకు నిద్ర లేకుండా చేస్తాయి. అటువంటి బుమ్రా బౌలింగ్ లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అటువంటిది బుమ్రా బౌలింగ్ లో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు.

Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు

వర్షం కురిసి.. ఆగిపోయిన తర్వాత గౌహతిలో మ్యాచ్ నిర్వహణకు అంపైర్లు ముందుకు వచ్చారు. హార్దిక్ పాండ్యా టాస్ నెగ్గి ముందు బంతి అందుకున్నాడు . అది చాలా తప్పుడు నిర్ణయమని రాజస్థాన్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశారు.

11 ఓవర్ల మ్యాచ్ లో ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగారు. మూడు ఓవర్లలోనే 58 పరుగులు చేశారు. దీపక్ చాహర్ తొలి ఓవర్ లో 22 పరుగులు ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్ లో 14 పరుగులు వచ్చాయి. బౌల్ట్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 22 పరుగులు వచ్చాయి.

తొలి ఓవర్ లో చాహర్ 22 పరుగులు ఇచ్చిన నేపథ్యంలో హార్దిక్ పాండ్యా బంతిని బుమ్రాకు అందించాడు. అతడి బౌలింగ్ ను సూర్యవంశీ వదలలేదు. తొలి బంతిని ఫుల్లర్ లెంగ్త్ గా జస్ ప్రీత్ వేశాడు. వైభవ్ మరో మాటకు తావు లేకుండా దానిని స్టాండ్స్ లోకి పంపించాడు సూర్యవంశీ. రెండో బంతికి సింగిల్ తీశాడు సూర్యవంశీ. మూడో బంతికి సింగిల్ తీసి ఇచ్చాడు జైస్వాల్. నాలుగో బంతిని స్లోయర్ వన్ గా వేశాడు. ఆ బంతిని సూర్యవంశీ సిక్సర్ కొట్టాడు.

బుమ్రా బౌలింగ్ లో ఇలా సూర్యవంశీ రెండు సిక్సర్లు కొట్టడంతో గౌహతి మైదానం హోరెత్తిపోయింది. మహామహా బ్యాటర్లు కూడా బుమ్రా బౌలింగ్ లో ఆడేందుకు ఇబ్బందిపడతారు. కానీ సూర్యవంశీ కనీసం భయపడలేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అతడు కొట్టిన వేగాన్ని చూసి బుమ్రా కూడా అవాక్కయ్యాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version