Rahul Dravid
Rahul Dravid: టెస్ట్ క్రికెట్లో గ్రేట్ వాల్ గా పేరుపొందాడు రాహుల్ ద్రావిడ్. వెస్టిండీస్ నుంచి మొదలుపెడితే ఆస్ట్రేలియా వరకు అన్ని జట్లపై అద్భుతమైన రికార్డు సృష్టించాడు. అందువల్లే అతడు మిస్టర్ డిపెండబుల్ గా పేరుపొందాడు. ఎంతటి కఠినమైన బంతులు వేసినా. . సహనాన్ని కోల్పోయేవాడు కాదు. బౌలర్ ఎంతలా రెచ్చగొట్టాలని ప్రయత్నించినా నిశ్శబ్దాన్ని అనుసరించేవాడు. అయితే అతడి ఆధ్వర్యంలో టీమిండియా 2007 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆ బాధతో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ టీమిండియాకు అతడు సేవలందించాడు. టీమిండియా హెడ్ కోచ్ గా పనిచేశాడు. టీం ఇండియా టి20 వరల్డ్ కప్ ను అతడి హెడ్ కోచ్ సారధ్యంలోనే సాధించింది. అతని పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కు హెడ్ కోచ్ గా కొనసాగుతున్నాడు.
Also Read : అక్షర్ కాదట, రాహుల్ కు అవకాశం లేదట.. కెప్టెన్ విషయంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.
వీల్ చైర్ పై ఉన్నప్పటికీ..
రాహుల్ ద్రావిడ్ ఎప్పుడు కూడా కోపాన్ని ప్రదర్శించడు. చిరునవ్వుతోనే ఆటగాళ్లకు శిక్షణ ఇస్తాడు. తన అనుభవాన్ని వారికి బోధిస్తాడు. అందువల్లే కేఎల్ రాహుల్ లాంటి ఆటగాడు పుట్టుకొచ్చాడు. ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లో టీమిండియా సాధించిన విజయంలో రాహుల్ ఎలాంటి పాత్ర పోషించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టి20 వరల్డ్ కప్ తర్వాత పదవీకాలం ముగిసే దశలో ఉన్నప్పుడు.. టీమిండియా కు హెడ్ కోచ్ గా కొనసాగాలని రోహిత్ శర్మ ద్రావిడ్ ను కోరాడు. అయితే దానిని ద్రావిడ్ సున్నితంగా తిరస్కరించాడు. ఇక ఇటీవల బెంగళూరులో క్రికెట్ ఆడుతుంటే రాహుల్ ద్రావిడ్ గాయపడ్డాడు. కొద్దిరోజులు మంచానికే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో.. అతడు వీల్ చైర్ మీదనే మైదానం లోకి వచ్చాడు. రాజస్థాన్ జట్టు ఆడుతున్న తీరును పరిశీలించాడు. చేతి కర్రల సహాయంతో రాజస్థాన్ జట్టు శిక్షణ శిబిరానికి వచ్చి.. జట్టు పురోగతిని పర్యవేక్షించాడు..” తీవ్రంగా గాయమైనప్పటికీ.. వీల్ చైర్ కే పరిమితమైనప్పటికీ రాహుల్ ద్రావిడ్ జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా మైదానంలోకి వచ్చాడు. శిక్షణ శిబిరంలో జట్టు పురోగతిని పర్యవేక్షించాడు. అందువల్లే రాహుల్ ద్రావిడ్ మిస్టర్ డిపెండబుల్ అయ్యాడని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.. రాహుల్ ద్రావిడ్ కెరియర్ కొనసాగినంత కాలం పెద్దగా గాయాల బారిన పడలేదు. తనను తాను రక్షించుకుంటూనే బ్యాటింగ్ చేసేవాడు. అయితే ఇప్పుడు ఐదు పదుల వయసుకు వచ్చినప్పటికీ రాహుల్ ద్రావిడ్ ఒక్కపటిలాగానే క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ మ్యాచ్లో రాహుల్ ద్రావిడ్ గాయపడ్డాడు. అందువల్లే అతడు మంచానికి పరిమితమయ్యాడు. అయినప్పటికీ జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా అతడు రాజస్థాన్ రాయల్స్ శిక్షణ శిబిరానికి హాజరయ్యాడు.
Also Read :18 సీజన్లుగా అతడొక్కడే కింగ్…విరాట్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన RCB