Asia Cup 2023 India Squad: ఇండియన్ క్రీకెట్ బోర్డ్ ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకుంటున్న ఆసియా కప్ లో పాల్గొనబోయే టీమ్ ఇండియా వివరాలు మరికొద్ది సేపట్లో ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన విషయాలు చర్చించడం కోసం భారత్ సెలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశం అవుతుంది. ఈ సమావేశం అజిత్ అగర్కర్ అధ్యక్షతన జరుగుతుంది. అలాగే ఇందులో టీం కెప్టెన్, కోచ్ ఇద్దరు పాల్గొంటారు. అందిన సమాచారం ప్రకారం 17 మంది ఆటగాళ్లను ఆసియా కప్ కు ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే రాహుల్ , అయ్యర్ విషయంలో సెలక్షన్ కమిటీ ఎటువంటి హడావిడి పడేలా కనిపించడం లేదు. ఆసియా కప్ లాంటి పెద్ద టోర్నమెంట్ కోసం వీళ్లిద్దరు బరిలోకి దింపి రిస్కు తీసుకునే ఉద్దేశం కమిటీకి లేదు.వీళ్ళిద్దరికీ సంబంధించిన ఫిట్నెస్ నివేదిక సంతృప్తికరంగా ఉంటే..ఆ తర్వాత వాళ్ళు జట్టులో కొనసాగుతారా లేదా అన్న విషయంపై ఒక నిర్ధారణకు రావాలి అని కమిటీ భావిస్తుంది.
టీం సెలక్షన్ చేసే మీటింగ్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారబోతున్నారు. మంచి ప్లేయర్స్ అయినప్పటికీ, ఫిట్ గా ఉన్నప్పటికీ ,ప్రస్తుతం వాళ్లు మ్యాచ్ ఆడేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు అన్న విషయం తేలితే తప్ప ఆసియా కప్ కు వెళ్లే జట్టులో వీళ్ళకు అవకాశం కలగదు. మొన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో ప్రతిదానికి అందరూ సెలక్షన్ కమిటీని నిందించారు.
దీంతో ఈసారి సెలక్షన్ కమిటీ ఆసియా కప్ కు ఎంచుకోబోయే టీం విషయంలో అన్ని కోణాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం చూస్తే ప్రస్తుతానికి కేఎల్ రాహుల్ మాత్రం ఆసియా కప్ లో ఆడడం చాలా కష్టం అనిపిస్తుంది. మరోపక్క శ్రేయస్ అయ్యర్ ఎన్ని మ్యాచ్ లలో ఫిట్గా ఉన్నాడు, మంచిగా పెర్ఫార్మ్ చేశాడు అనే దానిపై అతని ఎంపిక పూర్తిగా ఆధారపడి ఉంటుంది.
రీసెంట్గా రాహుల్ హామ్ స్ట్రింగ్ సర్జరీ చేయించుకున్నాడు. ఇక అయ్యర్ వెన్నుకు తగిన గాయం గురించి తెలిసిందే. ఇంజురీస్ నుంచి కోల్కున్నప్పటికీ.. ఈ ఇద్దరి ఆటగాళ్లు చాలా కాలంగా క్రికెట్ కి దూరంగా ఉన్నారు…మరి ఇప్పుడు సెలక్షన్ కమిటీ నిర్ణయం వాళ్ళ ఫిట్నెస్ నివేదిక మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇద్దరి ఆటగాళ్లలో ఎవరికైనా ఒకరికి మాత్రమే టీం లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అన్న టాక్ కూడా నడుస్తుంది.