Posani Krishna Murali
Posani Krishna Murali: ఏ విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నైజం పోసాని కృష్ణ మురళి సొంతం. మాటల రచయితగా కథ రచయితగా, నటుడిగా , దర్శకుడిగా పలు విభిన్న కోణాలు ఉన్న పోసాని, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. వైసీపీ నేతగా సీఎం జగన్ కు గట్టి మద్దతుదారుడిగా ఉన్నాడు. ప్రత్యర్థులు మీద విరుచుకుపడుతూ తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నాడు పోసాని.
సీఎం జగన్.. పోసానిని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. పోసాని ప్రస్తుతం వైసీపీ పార్టీలో జగన్ కి వీర విధేయుడిగా మారారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ పోసాని కొన్ని హాట్ హాట్ కామెంట్స్ చేశాడు. నేను చనిపోతే నా శవాన్ని చూడటానికి ఇండస్ట్రీ జనాలు ఎవరు రాకూడదు. ఈ విషయం గురించి ఇప్పటికే నా భార్య ను , నా కుటుంబాన్ని సిద్ధం చేశాను.
నన్ను ఇప్పటికిప్పుడు ఎవరైనా హత్య చేసిన కానీ, నేను చనిపోయిన కానీ చిన్న కన్నీటి బొట్టు కూడా కార్చవద్దు అని నా భార్యకు చెప్పాను. ఆమెకు నాతో గడిపిన సంతోషకరమైన క్షణాలు గుర్తు ఉండాలి కానీ, నా చావు కాదు. ఒకవేళ నేను చనిపోతే ఏమి చేసి బతకాలి అనే ఆలోచన ఆమెకు ఉండకూడదు. అందుకే 50 కోట్లు విలువైన ఆస్తులు ఆమె పేరు మీద రాశాను. నెలకు దాదాపు 9 లక్షలు వాటి మీద వస్తుంటాయి. ఇక నా పిల్లలు మున్ముందు ఎలా ఉంటారో నాకు తెలియదు. ఇక్కడ ఉండవచ్చు లేదా విదేశాల్లో ఉండవచ్చు. ఏమి జరిగిన కానీ నా భార్య ఇబ్బంది పడకూడదని ఆస్తి ఆమె పేరు మీద రాశానని చెప్పారు.
మరి మీ శవాన్ని ఇండస్ట్రీ జనాలు ఎందుకు చూడకూడదు అనే ప్రశ్న రావటంతో దానిని పోసాని ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది. నేను చాలా నిజాయితీగా, చాలా గొప్ప బతుకు బతికాను. కాబట్టి నా శవాన్ని నా కుటుంబం, నా రక్త సంబంధం వాళ్ళు మాత్రమే చూడాలి, బయట వాళ్ళు సానుభూతి నాకు అవసరం లేదని చెప్పారు పోసాని. ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ఇండస్ట్రీ జనాలు బతుకులు అంత గొప్ప బతుకులు కాదు, వాళ్ళకి నా శవాన్ని చూసే అర్హత కూడా లేదని పోసాని ఆలోచన కావచ్చు.