Rahmanullah Gurbaz: తల్లి ఆస్పత్రిలో సీరియస్ గా ఉన్నా.. షారుఖ్ పిలిచాడని వచ్చి కేకేఆర్ ను ఫైనల్ చేర్చాడు

సాల్ట్ కంటే ముందు జేసన్ రాయ్ ఓపెనర్ స్థానంలో ఉండేవాడు. అతని తర్వాత సాల్ట్ జట్టులోకి వచ్చాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో కోల్ కతా ను గెలిపించాడు. 12 మ్యాచ్లలో 185 కి పైగా స్ట్రైక్ రేట్ తో 435 రన్స్ చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 22, 2024 4:42 pm

Rahmanullah Gurbaz

Follow us on

Rahmanullah Gurbaz: ప్లే ఆఫ్ మ్యాచ్ లో కోల్ కతా జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. హైదరాబాద్ జట్టుపై అన్ని విభాగాలలో పై చేయి సాధించి.. దర్జాగా ఫైనల్ దూసుకెళ్లింది. కోల్ కతా జట్టుకు తురుపు ముక్కలాగా ఉన్న ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ దూరం కావడంతో.. అతని స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రెహమానుల్లా గుర్బాజ్ ఓపెనింగ్ బ్యాటర్ గా మైదానంలోకి వచ్చాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఇక్కడే గుర్బాజ్ తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు.. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

మే మొదటి వారంలో గుర్బాజ్ తన తల్లికి అనారోగ్యంగా ఉందని ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్లే ఆఫ్ కోసం కబురు రావడంతో.. మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఓవైపు ఆసుపత్రిలో ఉన్న తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తూనే.. జట్టు కోసం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. “మా అమ్మకు అనారోగ్యం. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాల్ట్ జట్టుకు దూరం కావడంతో.. నాకు మేనేజ్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. గుర్బాజ్ మీ అవసరం ఏర్పడిందని యాజమాన్యం అడిగింది. మీరు వస్తే బాగుంటుందని చెప్పడంతో.. నేను వెంటనే వచ్చేసాను.. మా అమ్మ ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉంది. ఆమెతో నేను ఫోన్ మాట్లాడుతున్నాను. నాకు నా కుటుంబంతోపాటు.. కోల్ కతా కుటుంబం కూడా అత్యంత ముఖ్యం. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితి కఠినమైనదే. కాకపోతే రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. నేను చేపట్టాల్సిన బాధ్యతలు ఇక్కడ చాలా ఉన్నాయని” గుర్బాజ్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. కోల్ కతా తరఫున అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అతడు.. గూగుల్ ట్రెండ్స్ లో కొనసాగుతున్నాడు.

సాల్ట్ కంటే ముందు జేసన్ రాయ్ ఓపెనర్ స్థానంలో ఉండేవాడు. అతని తర్వాత సాల్ట్ జట్టులోకి వచ్చాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో కోల్ కతా ను గెలిపించాడు. 12 మ్యాచ్లలో 185 కి పైగా స్ట్రైక్ రేట్ తో 435 రన్స్ చేశాడు. దీంతో గుర్బాజ్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావలసి వచ్చింది. ప్లే ఆఫ్ లో కాకుండా లీగ్ దశలో గుర్బాజ్ ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అయినప్పటికీ అతడు ఏమాత్రం బాధపడలేదు. సాల్ట్ దూరం కావడంతో జట్టులోకి గుర్బాజ్ తిరిగి వచ్చాడు..

ఇక క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి 159 రన్స్ చేసింది. హైదరాబాద్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని.. కోల్ కతా 13.4 ఓవర్లలోనే చేదించింది. వికెట్ కీపర్ గా గుర్బాజ్ కీలకపాత్ర పోషించాడు. రెండు క్యాచ్ లు పట్టుకున్నాడు. కీలకమైన రాహుల్ త్రిపాఠి రన్ అవుట్ కావడంలో ముఖ్యపాత్ర పోషించాడు. బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. 14 బంతుల్లో 23 పరుగులు చేశాడు.. హైదరాబాద్ జట్టుతో విజయం అనంతరం గుర్బాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసాయి. చాలామంది క్రికెట్ అభిమానుల గుండెను తట్టి లేపాయి. గుర్బాజ్ గురించి పశ్చిమబెంగాల్, ఒడిస్సా, తమిళనాడు, దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి ప్రాంతానికి చెందిన నెటిజన్లు విపరీతంగా శోధించారు. దీంతో అతడు ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయ్యాడు.