https://oktelugu.com/

క్రికెట్ కే మచ్చ.. ఎన్నాళ్లీ తెల్లజాతి దురహంకారం?

తెల్లజాతి దురహంకారానికి అంతే లేకుండా పోతోంది. ఆస్ట్రేలియా జాతి వివక్ష పతాక స్థాయికి చేరుతోంది. అక్కడి క్రికెటర్లకే కాదు.. ప్రేక్షకులు కూడా భారతీయులను జీర్ణించుకోవడం లేదు. వారిపై గెలుస్తున్నందుకు మన క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సిడ్నీ మైదానంలో ఈరోజు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులోనూ మరోసారి భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ పై జాతివివక్ష వ్యాఖ్యలు కలకలం రేపాయి. సిరాజ్ ఫిర్యాదు చేయడంతో టీమిండియా మొత్తం కదిలి ఎంపైర్లకు ఆస్ట్రేలియా అభిమానులను చూపించి వీరే […]

Written By:
  • NARESH
  • , Updated On : January 10, 2021 / 07:52 PM IST
    Follow us on

    తెల్లజాతి దురహంకారానికి అంతే లేకుండా పోతోంది. ఆస్ట్రేలియా జాతి వివక్ష పతాక స్థాయికి చేరుతోంది. అక్కడి క్రికెటర్లకే కాదు.. ప్రేక్షకులు కూడా భారతీయులను జీర్ణించుకోవడం లేదు. వారిపై గెలుస్తున్నందుకు మన క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు.

    తాజాగా సిడ్నీ మైదానంలో ఈరోజు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులోనూ మరోసారి భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ పై జాతివివక్ష వ్యాఖ్యలు కలకలం రేపాయి. సిరాజ్ ఫిర్యాదు చేయడంతో టీమిండియా మొత్తం కదిలి ఎంపైర్లకు ఆస్ట్రేలియా అభిమానులను చూపించి వీరే తిడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎంపైర్లు రంగంలోకి దిగి వారిని బెదిరించి స్టేడియం నుంచి పంపించివేశారు. ఆట దాదాపు 10 నిమిషాల పాటు నిలిచిపోయింది.

    ఈ సందర్భంగా సీనియర్ బౌలర్ అశ్విన్ ఆస్ట్రేలియన్ల తీరును ఎండగట్టాడు. సిడ్నీ వేదికగా ప్రేక్షకుల ఎప్పుడూ ఆటగాళ్లను తిడుతూనే ఉంటారని.. తాను బాధితుడినేనని పేర్కొన్నారు. వీటిపై ఐసీసీ , క్రికెట్ ఆస్ట్రేలియా ఉక్కు పిడికిలి బిగించాలని డిమాండ్ చేశారు.

    భారత ఆటగాళ్లపై జాత్యాంహకార వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్ అయ్యింది. దీన్ని తీవ్రంగా ఖండించింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియాను వివరణ కోరింది. ఇలాంటి ఉపేక్షించమని స్పష్టం చేసింది. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా కూడా జరిగిన దానిపై భారత ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పింది.