దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకముందే బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 2020 సంవత్సరంలా 2021 సంవత్సరంలో కూడా వైరస్, బ్యాక్టీరియాలకు ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. బర్డ్ ఫ్లూ వల్ల కోళ్లు, బాతులు, నెమళ్లు చనిపోతున్నాయి. ఇప్పటివరకు ఏడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా మరికొన్ని రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: కరోనా వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్ ఎంతకాలం ఉంటుందంటే..?
బర్డ్ ఫ్లూ వల్ల కోళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. కోళ్ల ద్వారా బర్డ్ ఫ్లూ బారిన పడే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మరి పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా..? సోకదా..? అనే ప్రశ్నకు ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే బర్డ్ ఫ్లూ బారిన పడమని చెబుతున్నారు.
Also Read: గుడ్లు, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ బారిన పడతామా.. వాస్తవమేమిటంటే..?
మనుషులకు బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల లాలాజలం, వ్యర్థాల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చికెన్, గుడ్లు ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ఉడికించుకుని తినాలని.. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు బర్డ్ ఫ్లూ బారిన పడితే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒంటినొప్పులు బర్డ్ ఫ్లూ లక్షణాలని పేర్కొంది.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా బర్డ్ ఫ్లూ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కోళ్ల ఫారాలలో పని చేసేవాళ్లు గ్లౌజులు, పీపీఈ కిట్లు ధరించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.