https://oktelugu.com/

వావ్.. 100 మిలియన్లు.. ఇంకా అదే ఊపు !

‘అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు , జరిగిన తరవాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు’ అంటూ దర్శకుడు త్రివిక్రమ్ ఒక మంచి డైలాగ్ రాశాడు. సడెన్ గా రిలీజ్ అయిన ‘కేజిఎఫ్ 2’ సినిమా టీజర్ కి ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. రిలీజ్ అయిన దగ్గర నుండీ ఈ సినిమా టీజర్ సృష్టిస్తోన్న సంచలనం మాత్రం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. కేవలం 24 […]

Written By:
  • admin
  • , Updated On : January 10, 2021 / 07:26 PM IST
    Follow us on


    ‘అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు , జరిగిన తరవాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు’ అంటూ దర్శకుడు త్రివిక్రమ్ ఒక మంచి డైలాగ్ రాశాడు. సడెన్ గా రిలీజ్ అయిన ‘కేజిఎఫ్ 2’ సినిమా టీజర్ కి ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. రిలీజ్ అయిన దగ్గర నుండీ ఈ సినిమా టీజర్ సృష్టిస్తోన్న సంచలనం మాత్రం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ సాధించింది. కేవలం 24 గంటల్లో 70 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని ఒక రికార్డ్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు సెంచరీ కూడా కొట్టి.. మరో సరికొత్త రివార్డ్ ను సొంతం చేసుకుంది.

    Also Read: అరె.. పూర్తిగా మారిపోయిన స్టార్ దర్శకుడు !

    ఈ టీజర్ కి వస్తోన్న వ్యూస్ చూస్తుంటే, ఈ సినిమాకి కూడా ‘బాహుబలి 2’కి వచ్చిన క్రేజ్, బజ్ వచ్చేలా ఉంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. సో.. సమ్మర్ రేస్ లో దిగనున్న ఈ మూవీ మరో “బాహుబలి 2″లా కలెక్షన్లు పొందుతుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి టీజర్ తో మాత్రం ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసింది ఈ సీక్వెల్ సినిమా. ఇక ఈ సినిమా హీరో రాకింగ్ స్టార్ యశ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ.. తన సినిమా టీజర్ సాధిస్తోన్న వ్యూస్ గురించి, టీజర్ రికార్లుల గురించి తెగ ప్రోమోట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

    Also Read: తనకు పోటీ ఎవరో చెప్పిన రకుల్ !

    ఏది ఏమైనా యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి, నేషనల్ రేంజ్ లో సాధించిన కలెక్షన్స్ గురించి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయినప్పుడు అందరూ లైట్ తీసుకున్నారు. ఆ తరువాత ఈ సినిమాలోని గొప్పతనాన్ని అర్ధం చేసుకున్న ఆడియన్స్, ఈ సినిమాని విరగబడి చూశారు. ఇక అప్పట్నుంచి అందరూ ‘కేజీఎఫ్-2’ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్